Tap to Read ➤

సిగరెట్ మానేయాలంటే ఇవి ఫాలో అవ్వండి...

కొన్ని హోమ్ రెమెడీస్ మరియు ఆయుర్వేదిక్ చిట్కాలు ఫాలో అవ్వడం ద్వారా ధూమపానం అలవాటు నుండి సులభంగా బయటపడొచ్చు.
ప్రతి సంవత్సరం మార్చి నెలలో రెండో బుధవారం రోజున నేషనల్ నో స్మోకింగ్ డే జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 9వ తేదీన వచ్చింది.
మొట్టమొదట నో స్మోకింగ్ డేను 1984లో జరిపారు. ప్రతి సంవత్సరం ఒక థీమ్ ను రూపొందిస్తూ.. పొగతాగడం వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ ప్రచారం చేస్తారు.
మీకు ధూమపానం అలవాటు ఎక్కువగా ఉండి.. ఈ వ్యసనం నుండి బయటపడాలంటే.. మీరు మీతో పాటు ఊరగాయ పొడి అల్లం ఉంచుకోవాలి. మీకు పొగాకు లేదా దాని ఉత్పత్తులను వాడాలని అనిపించినప్పుడల్లా ఈ అల్లం నమలండి....
మీ శరీరంలో నుండి విషాన్ని తొలగించడంలో నీరు చాలా ఉపయోగకరంగా పని చేస్తుంది. మీరు ధూమపానం మానేయాలంటే.. ప్రతిరోజూ భోజనం చేయడానికి ముందు కనీసం 15 నిమిషాల ముందు ఒక గ్లాసు నీరు తాగితే జీవక్రియ రేటు అదుపులో ఉంటుంది.
మీకు సిగరెట్ తాగాలని మైండ్లో ఆలోచన వచ్చినప్పుడల్లా, లిక్వోరైస్ ను నమలండి ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మీకు పొగాకు ఉత్పత్తులను తీసుకోవాలనే కోరిక తగ్గుతుంది.
మీకు పొగాకు ఉత్పత్తులను తీసుకోవాలని కోరిక కలిగినప్పుడల్లా మీరు కొన్ని సోంప్ గింజలను నమలండి. అలాగే ఆకుకూరలను ఎక్కువగా తినండి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీరు పొగాకు తాగడం అనే వ్యసనం నుండి బయటపడొచ్చు.
త్రిఫల తీసుకోవడం వల్ల మీ బాడీలో నుండి టాక్సిన్స్ క్లియర్ చేయబడతాయి. అంతేకాదు విషపూరిత పోగాకు ఉత్పత్తులను తీసుకోవాలనే కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది.
జటాస్మి, చామాంతి మరియు బ్రాహ్మిలను సమాన పరిమాణంలో కలపండి. వీటిని ఒక జాడీలో ఉంచండి. ఒక టేబుల్ స్పూన్ తో ఈ మిశ్రమాన్ని ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ముంచి నెమ్మదిగా తాగాలి. ఇలా చేయడం వల్ల ధూమపానం చేయాలనే కోరికను అధిగమించేందుకు సహాయపడుతుంది.
ఈరోజున పొగతాగడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ.. ఆరోగ్యంపై అవగాహన కల్పించే దినోత్సవంగా జరుపుకుంటారు. ఎవరైతే పొగతాగడం మానేయాలని అనుకుంటారో.. వారికి సాయం చేయడమే నో స్మోకింగ్ డే ఉద్దేశ్యం.