Tap to Read ➤

పెళ్లి డ్రస్సుల్లో తళుక్కుమన్న ఆలియా-రణబీర్..

బాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్లి పీటలెక్కింది.. ఆ జంట విశేషాలేంటో చూసేద్దాం రండి...
ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన వీరి వివాహం ఏప్రిల్ 14వ తేదీన గురువారం నాడు ఘనంగా జరిగింది...
అతికొద్ది మంది అతిథులు, బంధుమిత్రుల మధ్య ఆలియా, రణబీర్ ల కళ్యాణం కమనీయంగా సాగింది...
కపూర్, భట్ కుటుంబ సభ్యులు భారతీయ సాంప్రదాయంలో వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది...
ఈ ప్రేమ పావురాల పెళ్లి గురించి కుటుంబసభ్యులు గానీ.. వధూవరులు గానీ.. ఎక్కడా వివరాలు వెల్లడించలేదు. చాలా గోప్యత పాటించారు..
వీరి పెళ్లికి సంబంధించిన తేదీని, శుభ ముహుర్త వివరాలను బహిరంగంగా ప్రకటించలేదు. అయితే వీరి పెళ్లిపై మాత్రం చాలా రుమార్లు వచ్చాయి.
ఈ బాలీవుడ్ లవర్స్ తమ వివాహానికి ముందే అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నారు. తమ వివాహా కార్యక్రమాలకు సంబంధించి ఒక్క ఫొటో, వీడియో కూడా బయటకు వెళ్లకూడదని కాంట్రాక్ట్ ఫిక్స్ చేసుకున్నారట..
వీరి వివాహాన్ని అత్యంత గోప్యంగా చేసుకున్నప్పటికీ.. రిసెప్షన్ మాత్రం బాలీవుడ్ తారల మధ్య ఘనంగా జరుపుకున్నట్లు సమాచారం..
రిసెప్షన్ కు ముందు కొత్త పెళ్లి కూతురు అందరికీ అభివాదం చేస్తూ.. ముందుకొచ్చేసింది...
ముంబైలో రణబీర్ ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో మెహందీ, సంగీత్ వంటి ఈవెంట్లు ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది.