Tap to Read ➤

సమ్మర్లో ఇమ్యూనిటీ పెంచే డ్రింక్స్ ఇవే...

విటమిన్-సి ఏయే జ్యూస్ లలో ఎక్కువగా లభిస్తుంది. వేసవిలో ఎలాంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Venkatesh S
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపడం మరియు ఎలాంటి రోగాలు దరి చేరకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు.
గత రెండు సంవత్సరాలుగా మనలో చాలా మంది ఎక్కువ ఇమ్యూనిటీ ఉండే ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించారు. రోగనిరోధక శక్తి వల్ల వ్యాధికారకాలు, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు లేదా వ్యాధుల నుండి ఉపశమనం పొందొచ్చు.
విటమిన్ సి ఎముకలు మరియు దంతాలను బలంగా మార్చడం, జీవక్రియను పెంచడం, గాయాలను నయం చేయడం మరియు చర్మం, జుట్టును ఆరోగ్యకరంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
స్ట్రా బెర్రీ-కివీ డ్రింక్ : విటమిన్ సి, బి1, బి9, బి6 బి12 ఎక్కువగా ఉండే పానీయాలను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.
ఆరెంజ్ గ్రేప్ జ్యూస్ జ్యూస్ లో విటమన్ ఎ మరియు విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ ర్యాడికల్ డ్యామేజీని నివారిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుదలలో కచ్చితంగా సహాయపడుతుంది.
తాజా టొమోటో రసంలో విటమిన్-ఎ, విటమిన్-సి మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల అంటువ్యాధులనేవి దరి చేరవు. మనం ఆరోగ్యకరంగా ఉండేందుకు సహాయపడుతుంది.
గ్రీన్ యాపిల్-క్యారెట్ జ్యూస్... ఈ డ్రింక్స్ లో విటమిన్ ఎ, విటమిన్-సి, విటమిన్-బి6 పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ బాడీలో రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా మీ శరీరాన్ని రక్షిస్తుంది. వీటితో పాటు బీట్-క్యారెట్-అల్లం పానీయం తాగడం వల్ల మీకు వాపు, జలుబు, ఫ్లూ లక్షణాలు వంటివి దరి చేరవు.
విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే హానికరమైన ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధుల నుండి రక్షించే యాంటీ ఆక్సిడెంట్లను ఎక్కువగా కలిగి ఉంటుంది.
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. విటమిన్ సి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది గౌట్ ప్రమాదాన్ని కలిగించదు.
విటమిన్ సి రక్తహీనత, ఐరన్ లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ నాడీ వ్యవస్థను కూడా రక్షిస్తుంది మరియు చిత్త వైకల్యం మరియు ఇతర జ్ణాపకశక్తి రుగ్మతలను నిర్వహిస్తుంది.