Tap to Read ➤

హోలీ రంగులను ఈజీగా తొలగించుకోవాలంటే..

హెయిర్, గోర్లు(Nails), మరియు బట్టల నుండి రంగులను వదిలించుకోవడం చాలా కష్టమే. అయితే ఈ రంగుల గురించి మీరు చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ హోమ్ రెమెడీస్ తో మీ ఫేస్, హెయిర్, బట్టలపై పడ్డ రంగులను సులభంగా తొలగించుకోవచ్చు.
Venkatesh S
మీరు హోలీ వేడుకల్లో పాల్గొన్న తర్వాత, మీ ఫేస్ పై రంగులను సులభంగా తొలగించుకోవాలంటే.. ముందుగా మీ ముఖంపై కొబ్బరినూనె రాయండి.
ఏదైనా క్యారియర్ ఆయిల్ తో గోధుమ పిండిని పేస్టులా చేసి ముఖానికి రాయాలి. కొన్ని నిమిషాల తర్వాత మసాజ్ చేయండి. ఆ తర్వాత సున్నితమైన క్లెన్సర్ తో కడుక్కోవాలి.
మీ ఫేసుపై పడ్డ రంగులను తొలగించడానికి ముల్తానీ మట్టిని కూడా వాడొచ్చు. ఎందుకంటే ఇది రంగును ఆరబెట్టడంలో సహాయపడుతుంది.
మీ చర్మంపై రంగులను తొలగించడానికి, దురదను పోగొట్టుకోవడానికి గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ మిశ్రమాన్ని వాడాలి.
కొందరు బాడీపై పడ్డ కలర్లను వదిలించుకోవడానికి స్క్రబ్ చేస్తుంటారు. ఇలా చేయకూడదు. ఎందుకంటే మీరు చర్మంపై స్క్రబ్ చేస్తే మీ చర్మం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
హోలీ ఆడిన తర్వాత కొందరి గోళ్లు పసుపు రంగులోకి మారతాయి. దీన్ని నివారించడానికి మీరు నిమ్మరసం ఉపయోగించాలి. మీ గోళ్లను నిమ్మరసంలో 10 నిమిషాలు నానబెట్టండి
హోలీ ఆడిన వెంటనే మీ జుట్టుకు షాంపూ పెట్టడం మానుకోండి. * అందుకు బదులుగా గుడ్డులోని పచ్చని సొన లేదా పెరుగు మాస్కులను అప్లై చేయండి. 45 నిమిషాల పాటు అలాగే ఉండండి.
హోలీ ఆడిన తర్వాత, మీ జుట్టును సాధారణ నీటితో కడగాలి. అప్పుడే చాలా వరకు కలర్స్ పోతాయి. అనంతరం షాంపూ వాడి, వెంటనే కండిషనర్ వాడాలి.
జుట్టుపై రంగులు సులభంగా పోవడానికి..రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనెలో నాలుగు టేబుల్ స్పూన్ల తేనే మరియు కొన్ని చుక్కల నిమ్మరసం బాగా కలపండి. ఈ ప్యాక్ ని మీ జుట్టుపై అప్లై చేసి 30 నిమిషాల పాటు వెయిట్ చేయండి. అనంతరం తేలికపాటి షాంపూ మరియు గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి.
మీ బట్టలు తెల్లగా ఉంటే.. వాటిపై పడ్డ రంగులు పోవాలంటే.. మీ బట్టలను క్లోరిన్ బ్లీచ్ లేకుండా వెచ్చని నీటిలో నానబెట్టండి. ఇతర బట్టలకు ఈ రంగులు అంటకుండా.. విడిగా వీటిని నానబెట్టండి.
2-3 లీటర్ల నీటిలో సగం కప్పు వైట్ వెనిగర్ మరియు 1 టేబుల్ స్పూన్ డిటర్జెంట్ కలపడం వల్ల మీ బట్టలపై పడ్డ రంగులను సులభంగా తొలగించుకోవచ్చు. అలాగే యాసిడ్ మీ బట్టలపై పడ్డ మొండి మరకలను కూడా తొలగిస్తుంది.