Tap to Read ➤

హనుమంతుడిని ఇలా ఆరాధిస్తే.. శని ప్రభావం తగ్గుతుంది..!

హనుమాన్ జయంతి 2022 సందర్భంగా శని దోషం పోవడానికి పాటించాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Venkatesh S
ఈ ఏడాది హనుమాన్ జయంతికి ఓ ప్రత్యేకత ఉంది. శనివారం ఆంజనేయుడికి ఇష్టమైన రోజు. ఈ సంవత్సరం ఇదే రోజున హనుమాన్ జయంతి వచ్చింది.
హిందూ పంచాంగం ప్రకారం, 2022లో ఏప్రిల్ 16వ తేదీన అంటే శనివారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున అర్ధరాత్రి 2:25 గంటలకు శుభ ముహుర్తం ప్రారంభమవుతుంది.
ఈ పవిత్రమైన రోజున అర్ధరాత్రి 2:25 గంటలకు శుభ ముహుర్తం ప్రారంభమవుతుంది. అదే రోజు మధ్యాహ్నం 12:24 గంటలకు పూర్ణిమ తిథి ముగస్తుంది.
శ్రీరాముడు, సీతాదేవి మరియు హనుమంతులను గుర్తు చేసుకోవడానికి బ్రహ్మ ముహుర్తాలలో మేల్కొంటారు. తెల్లవారుజామునే నిద్ర లేచి, స్నానం చేయాలి.
ఆంజనేయుని ఆశీర్వాదం పొందడానికి, హనుమాన్ జయంతి రోజున ఆ దేవునికి సువాసన గల నూనె, మరియు సింధూరాన్ని అర్పించాలి.
హనుమాన్ జయంతి రోజున మీరు వెలిగించే దీపానికి ఆవ నూనెను మాత్రమే వాడాలి. దీపం వెలిగించిన తర్వాత 11సార్లు హనుమాన్ చాలీసాను పఠించాలి.
హనుమాన్ జయంతి రోజున పవన పుత్రుని ఆలయంలో శ్రీరామ, సీతాదేవి, ఆంజనేయుడిని పూజించాలి. అనంతరం రామ రక్షా స్తోత్రం పఠిస్తే హనుమంతుడి అనుగ్రహం కూడా లభిస్తుంది.
ఎవరి జాతకంలో అయినా శని దోషం ఉంటే, వారు హనుమాన్ జయంతి రోజున అంటే శనివారం నాడు ఆంజనేయుని ఆలయానికి వెళ్లి, కొబ్బరికాయను సమర్పించాలి.
హనుమాన్ జయంతి రోజున శని దోషం తగ్గేందుకు ఆంజనేయుడికి గులాబీ పువ్వుల మాలను ధరించాలి. అలాగే 11 తమలాపాకులపై రామ నామాన్ని రాసి హనుమంతునికి పువ్వుల మాలను సమర్పించాలి.