Tap to Read ➤

గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన హై ప్రొటీన్ ఫుడ్స్

మహిళ గర్భం పొందిన తర్వాత వారి రోజువారి ఆహారంలో పోషకాలు చాలా ముఖ్యం.పోషకాహారం తల్లి, బిడ్డకు చాాలా అవసరం. ప్రతి రోజూ హై ప్రోటీన్ ఫుడ్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల తల్లితో పాటు కడుపులో పెరిగే బిడ్డ ఆరోగ్యానికి సహాయపడుతాయి..
Saraswathi N
లెంటిల్స్: కందిపప్పు, పెసరపప్పు, వంటివి మరియు చిరుధాన్యాలు ఉడికించిన ఒక కప్పులో 18గ్రాములు ప్రోటీనులుంటాయి. ప్రతి రోజూ తయారుచేసే వంటల్లో వీటిని ఏదో ఒకరకంగా ఉపయోగించాలి. 
సాల్మన్ చేపల్లో విటమిన్ డీ, ఒమేగా-3 ఫాటీ యాసిడ్ లు అధికంగా ఉంటాయి. సాల్మన్ చేపలను తీసుకుంటే తల్లి,బిడ్డకు అవసరమైన పోషకాలు అందుతాయి. ఇది గర్భంలో శిశువు కళ్లు, మెదడు అభివృద్ధి చెందేందుకు సహాయపతుంది.
పాలు ఉత్పత్తులలో ప్రోటీన్, పొటాషియం మరియు కాల్షియం ఉంటాయి. రోజు పాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇందులో విటమిన్లు A మరియు D తో సమృద్ధిగా ఉన్నాయి
పాలక్ పన్నీర్ లో ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీ లకు చాలా ఆరోగ్యకరం. బిడ్డ ఎదుగుదలకు ఉత్తమమైనది.
మొలకెత్తిన విత్తనా్లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది గర్బిణీ స్త్రీలలో ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాధినిరోధకత పెంచుతుంది
చికెన్ లో ప్రోటీన్ తో పాటు,  ఇతర మినిరల్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉన్నందున దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల తల్లి బిడ్డకు తగిన పోషకాలు లభిస్తాయి.
కాలే మరియు బచ్చలికూర వంటి ముదురు ఆకుకూరలు తల్లి మరియ బిడ్డకు అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటాయి. వాటిలో విటమిన్లు A, C, K మరియు E, అలాగే కాల్షియం, ఐరన్, ఫైబర్ మరియు ఫోలేట్ ఉన్నాయి.