Tap to Read ➤

కలర్ ఫుల్ మెసెజెస్ తో హోలీ సంబరాలు..

హోలీ సందర్భంగా మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలను, కోట్స్ ను పంపండి. అలాంటి సందేశాలు, విషేస్, కోట్స్ జాబితాను మీ కోసం తీసుకొచ్చాం. వాటిలో మీకు నచ్చిన వాటిని షేర్ చేసుకోండి....
వసంత గమనంలో వస్తుంది రంగుల హోలీ.. నింపుతుంది మీ జీవితాలలో ఆనందాల కేళీ... అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు..
సప్త వర్ణాల శోభితమైన పండుగ.. సలక్షణమైన పండుగ.. వసంత శోభతో పరిడవిల్లే నూతన వేడుక.. రంగుల కేళీ.. హళీ పండుగ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.
చెడుపై మంచి విజయం.. చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా జరుపుకునే పండుగ హోలీ.. సుఖం.. దు:ఖం.. సంతోషం, విచారం అన్ని కలిసిన రంగులే ఈ హోలీ.. రాగద్వేషాలకు అతీీతంగా అందరినీ ఒక్కచోటకు చేర్చే పండుగే ఈ హోలీ.. మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు హోలీ శుభాకాంక్షలు...
రెయిన్ బో రంగులు..
హరివిల్లులోని రంగులన్నీ.. మురళీ నాదములోని మధువు కలిసి వచ్చి ఒక చోట చేరి హోలీ నాడు రంజింపచేయాలని కోరుతూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు..
హోలీ పండుగ రోజున ఒకరినొకరు ఆప్యాయంగా చల్లుకునేది రంగులు కాదు.. అనురాగం, ఆప్యాయతలతో కలిసిన పన్నీటి రంగుల జల్లులు..
మీకు, మీ కుటుంబ సభ్యులకు
హ్యాపీ హోలీ..
అన్ని రంగులు కలిస్తేనే ఈ నేచర్ కు అందం.. అన్ని మతాలు కలిసి ఉంటేనే ఈ దేశానికి ఆనందం..
అనురాగాలకు, ఆప్యాయతలకు ఆలవాలం ఈ హోలీ పండుగ..
 మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు..
రంగుల పండుగ వచ్చింది..
భిన్న వర్ణాలను ఏకతాటిపైకి తెస్తుంది..
భిన్న భావాలను సంకేతంగా నిలిచింది..
జీవిత వైవిధ్యాన్ని గుర్తు చేసింది..
మతసామరస్యంతో జీవించండి.. మానవత్వంతో మెలగండి అంటూ చాటి చెప్పింది..
అందరిలో ఆనందాన్ని తెచ్చి పెట్టింది.