Tap to Read ➤

అతియా అందాల రహస్యాలివే..

కెఎల్ రాహూల్ ప్రియురాలు అతియా శెట్టి అందాల రహస్యాలేంటో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.
కెఎల్ రాహూల్ ప్రియురాలు అతియా శెట్టి తన అందాన్ని కాపాడుకునేందుకు.. ఎప్పటికప్పుడు నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటుందట.
అతియా శెట్టి తన అందాన్ని పెంచుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగా తన ఫేసుకు రెగ్యులర్ గా ఫేస్ మాస్క్ ను వాడుతుందట.
ముందుగా కొబ్బరినీళ్లు -
2 టేబుల్ స్పూన్లు
సగం అరటి పండుఒక టేబుల్ స్పూన్ తేనే
2 టేబుల్ స్పూన్లు పెరుగు
పావు కప్పు బొప్పాయ
వీటన్నింటిని ఒక పాత్రలో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ముఖానికి రాసుకోవాలి. ఇది డ్రై అయ్యేటప్పుడు మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.
తన అందాన్ని కాపాడుకునేందుకు అతియా శెట్టి వారంలో మూడు రోజుల పాటు తన ఫేసుకు కొబ్బరి నూనె రాస్తుందట. అలాగే తన మేకప్ తీసేందుకు బేబీ ఆయిల్ ను వాడుతుందట.
కనుబొమ్మలు కాంతివంతంగా కనిపించేందుకు కాస్టర్ ఆయిల్ వాడుతుందట.
ఈ అందాల భామ ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డ్రై స్కిన్ మెరుగుదల కోసం ఓ టిప్ కూడా చెప్పింది.
విటమిన్ సి లేదా ఈ క్యాప్సూల్స్ ను కట్ చేసి ఫేసుకు రాసుకుంటే మంచి ఫలితం వస్తుందని చెప్పింది.
అతియా తన హెయిర్ హెల్దీగా ఉండేందుకు, తన కురులకు ఆనియన్ ఆయిల్ ను వాడుతుందట.
బియ్యం 6, 7 గంటలు నానబెట్టి, ఆ నీటిని ఓ బాటిల్ లో వేసి.. దాన్ని హెయిర్ కు స్ప్రే చేస్తే.. మన జుట్టుకు కావాల్సిన మంచి కండీషనర్ గా పని చేస్తుందని చెబుతోందీ ఈ అందాల భామ.