Tap to Read ➤

ఇంట్లోనే ఈజీగా రంగులు ఎలా చేసుకోవచ్చంటే...

రసాయన రంగులతో ఇబ్బంది పడకుండా ఇంట్లోనే ఈజీగా రంగులను తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడే చూసెయ్యండి.. రంగుల కేళిని ఆనందంగా జరుపుకోండి...
Venkatesh S
హోలీ పండుగ రోజున చాలా మంది రెడ్ కలర్స్ ను ఎక్కువగా వాడుతుంటారు. ఈ రంగును తయారు చేసేందుకు మందార పువ్వులను శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టాలి. అవి ఎండిన తర్వాత వాటిని పొడిని మెత్తని పేస్టులా మార్చుకోవాలి. అంతే మీకు కావాల్సిన రెడ్ కలర్ రెడీ అయినట్టే.
ఒకవేళ మీకు ఎక్కువ మోతాదులో కలర్ కావాలంటే, దీనికి కొద్దిగా బియ్యంపిండి, ఎర్రచందనం, 3 స్పూన్ల కుంకుమను కూడా కలపొచ్చు. ఈ రెడ్ కలర్ వల్ల మన బాడీకి ఎలాంటి హాని కలగదు. ఈ కలర్ ను పొడిగా మరియు తడిగా కూడా వాడొచ్చు.
హోలీ పండుగ రోజున రెడ్ కలర్ తో పాటు ఎల్లో కలర్ ను కూడా ఎక్కువగానే వాడతారు. అయితే ఈ రంగును ప్రిపేర్ చేయడానికి కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. దీనికోసం ఓపిక ఉండాలి.
ముందుగా 50 గ్రాముల సన్ ఫ్లవర్ పువ్వులు, 20 గ్రాముల నారింజ తొక్కల పొడి, చేమ గడ్డి పొడిని ఒక 200 గ్రాములు, 100 గ్రాముల పసుపు, 20 చుక్కల నిమ్మరసం.. వీటన్నింటి కలిపి ఒక పెద్ద పాత్రలో వేయాలి.
వీటిని ఎంత బాగా కలిపితే.. అంత మెత్తగా పసుపు రంగు వచ్చేస్తుంది.
ఎల్లో, రెడ్ కలర్ తర్వాత గ్రీన్ కలర్ రంగును కచ్చితంగా వాడతారు. దీన్ని తయారు చేసేందుకు ముందుగా గోరింటాకు పొడికి సమాన పరిమాణంలో బియ్యపు పిండిని కలపాలి.
అలాగే వేప ఆకులను నీటిలో వేసి బాగా వేడి చేయాలి. అందులోని పైన ఉన్న నీటిని వడబోసి మిగిలిన నీటిని తడి
గ్రీన్ కలర్ గా వాడుకోవచ్చు.
ఆరెంజ్ కలర్ కోసం ముందుగా మోదుగ పువ్వులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి లేదా నీటిలో వేడి చేసినా సరిపోతుంది. ఎన్నో ఆయుర్వేద గుణాలుండే మోదుగ పూలను ఎండబెట్టి దంచితే పొడి రంగు తయారవుతుంది.
కుంకుమ పువ్వును రాత్రంతా నీటిలో నానబెడితే ఉదయానికంతా ఆరెంజ్ కలర్లోకి మారిపోతుంది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని.
పింక్ కలర్ ను కూడా హోలీ పండుగ రోజున కచ్చితంగా వాడతారు. పింక్ కలర్ తయారు చేసేందుకు బీట్ రూట్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ముందుగా బీట్ రూట్ ను ఆరబెట్టాలి. అది పొడిగా మారినప్పుడు దానికి 2 స్పూన్ల గోధుమ పిండిని లేదా శనగ పిండిని కలిపితే చాలు.
మీకు డార్క్ పింక్ కలర్ కావాలంటే, మీరు ఫుడ్ గ్రేడ్ పింక్ కలర్ ను జోడించొచ్చు. తడి రంగు కావాలంటే బీట్ రూట్ ను
నీటిలో వేడి చేసి చల్లార్చాలి.
గోరింటాకు పౌడర్ ను ఒక భాగం తీసుకుని, దానికి నాలుగు భాగాలు ఉసిరి పౌడర్ ను కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని నీళ్లలో కలిపితే తడి బ్రౌన్ కలర్ రెడీ అవుతుంది. పొడి రంగులో కావాలంటే ఈ మిశ్రమానికి బియ్యం పిండిని కలపండి.