Tap to Read ➤

మ్యాంగో ఫేస్ ప్యాక్.. మీకు గ్లో లుక్..

ఈ సమ్మర్లో మ్యాంగో ఫేస్ ప్యాక్ ను ట్రై చేయండి.. మీ అందాన్ని మరింత పెంచుకోండి..
Venkatesh S
మామిడి పండు కేవలం ఆహారం, ఆరోగ్యానికే కాకుండా.. మన అందాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుందట.
ఎండాకాలంలో ఎక్కువగా లభించే మామిడి పండ్లలో బీటా-కెరోటిన్, విటమిన్ ఎలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
ఇవి చర్మంలోని మ్రుతకణాలను తొలగించడంతో పాటు మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ముందుగా ఒక పాత్రలో కొద్దిగా మామిడి పండ్ల గుజ్జు, రెండు టీ స్పూన్ల పెరుగు, రెండు టేబుల్ టీ స్పూన్ల తేనేను వేసి బాగా కలపాలి.
ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల వరకు వేచి ఉండాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి.
ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మీ ముఖంపై వచ్చిన మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.
ఒక పాత్రలో ఒక స్పూన్ మామిడి గుజ్జు, సగం స్పూన్ పాలు, ఒక టీ స్పూన్ తేనేను వేసి బాగా మిక్స్ చేయాలి.
ఆ తర్వాత ఆ ప్యాక్ ను ముఖానికి రాసుకోవాలి. సరిగ్గా అరగంట తర్వాత కూల్ వాటర్ తో ఫేసును క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. మెరిసే చర్మం కూడా వచ్చేస్తుంది.