Tap to Read ➤

హీరో ప్రభాస్ డైట్, ఫిట్నెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసా...

యంగ్ రెబల్ స్టార్ అందరినీ ఆకర్షించేందుకు తను ఎలాంటి డైట్ ఫాలో అవుతారు.. ఎలాంటి వర్కవుట్లు చేస్తారు..
ప్రభాస్ రెగ్యులర్ గా తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు కచ్చితంగా ఉండేలా చూసుకుంటారట. అలాగే చేపలు, బాదం, గింజలు, కోడిగుడ్డు, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటారట.
బాహుబలి, సాహో వంటి సినిమాల్లో నటించేందుకు గాను ప్రభాస్ కొన్ని సంవత్సరాల పాటు ప్రతిరోజూ ఎంతసేపు వర్కవుట్లు చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ప్రతిరోజూ తను 3 నుండి 6 గంటల వరకు వర్కవుట్లు చేసేవారట.
హీరో ప్రభాస్ సినిమా షూటింగ్ కోసం బయటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు వర్కౌట్స్ చేయడం మాత్రం ఆపరట. తనతో పాటు జిమ్ కు సంబంధించిన
వస్తువులన్నీ తీసుకెళ్తారట.
మరో వారం రోజుల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ విడుదల కానుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
ప్రభాస్ ప్రతిరోజూ 3 నుండి 6 గంటల వరకు జిమ్ లోనే గడిపేవారట.
మీరు కూడా ప్రభాస్ మాదిరిగా ఫిట్నెస్ సంపాదించుకోవాలనుకుంటే.. ఉదయాన్నే రన్నింగ్, స్విమ్మింగ్ మరియు సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. అలాగే భారీ వెయిట్ లిఫ్టింగ్ వంటివి రెగ్యులర్ గా చేయాలంటున్నాడు హీరో ప్రభాస్..
హీరో ప్రభాస్ ఫిట్నెస్ విషయంలో చాలా కఠినంగా ఉంటారట. ఈ విషయాన్నీ తన జిమ్ ట్రైనర్ స్వయంగా చెప్పడం గమనార్హం. డైట్ విషయంలోనూ అంతే ఫోకస్ పెడతారట. ఏడు రోజుల పాటు కఠినమైన డైట్ ను ఫాలో అవుతారట.