Tap to Read ➤

హోలీ వేళ కళ్లను ఎలా కాపాడుకోవాలంటే...

హోలీ పండుగ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలేంటి.. చేయాల్సిన పనులేంటి.. చేయకూడని పొరపాట్లు ఏంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Venkatesh S
హోలీ పండుగ రోజున పొరపాటున మీ కళ్లలో రంగులు పడితే, వాటిని వీలైనంత త్వరగా శుభ్రం చేసుకోవాలి. అది కూడా మంచి నీటితో లేదా తాగునీటితో ఎక్కువసార్లు కడుక్కోవాలి.
కంటిన్యూగా కళ్లు మూయడం, కళ్లను పైకి, కిందకు తిప్పడం వల్ల కొన్ని రకాల రంగులను తొలగించుకోవచ్చు. అయితే కళ్లలోకి డైరెక్టుగా నీళ్లు వేయకూడదు. అలా చేస్తే మరింత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.
హోలీ పండుగ రోజున ప్రతి ఒక్కరి జుట్టు కలర్ ఫుల్ గా మారిపోవడం ఖాయం. ఎందుకంటే ముఖంపై రంగులను తప్పించుకునే క్రమంలో తలపై కచ్చితంగా కలర్స్ పడతాయి.
అప్పుడు మీ జుట్టు పాడవుతుంది. అలా కాకుండా ఉండాలంటే మీ జుట్టు ముడి వేసుకోండి. దానిపై క్యాప్ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల కలర్ వాటర్ మీ జుట్టు ద్వారా కళ్లలోకి చేరే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
హోలీ రోజున మీ ముఖంపై రంగులు పడే సమయంలో మీరు కళ్లను, పెదాలను గట్టిగా మూసుకోవాలి. ఈ రెండు ప్లేసుల్లో రంగులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
హోలీ రంగులను చల్లుకునే సమయంలో.. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. రంగులు తాకిన మీ చేతులతో కళ్లను పొరపాటున కూడా తాకొద్దు.
కళ్లను నలపడం వంటివి అస్సలు చేయొద్దు. ఇలా చేస్తే మీరు కళ్లకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వాటర్ బెలూన్స్ వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి అత్యంత ప్రమాదకరంగా ఉండటమే కాదు.. మీ కళ్లకు తీవ్ర గాయాలు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల మీరు కంటిచూపు కోల్పోయే ప్రమాదం కూడా రావొచ్చు.
హోలీ కలర్స్ మీ కళ్లలో పడినా లేదా ఇతర పదార్థాలేమైనా పడితే వెంటనే కర్చీఫ్ లేదా టిష్యూర్ పేపర్ తో వాటిని మీ కళ్లలో నుండి తీయడానికి ప్రయత్నించొద్దు.
మీరు కలర్ ప్రొటెక్టివ్ గ్లాసులు, సన్ గ్లాసెస్ లేదా ప్లెయిన్ గ్లాసులు పెట్టుకుంటే మీ కళ్లకు ఎంతో సెక్యూర్ గా ఉంటుంది. మీ కళ్లలో రంగులు చేరకుండా ఉండేందుకు ఇవి ఎంతగానో సహాయపడతాయి.
మీ కళ్లు ఎర్రగా మారిపోయి.. బాగా దురదలు పెడుతుంటే.. కళ్ల నుండి నీరు కారుతున్నా.. మీకు అసౌకర్యంగా ఉన్నా, లేదంటే రక్తస్రావం వంటి ప్రమాదం ఏదైనా జరిగితే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కంటి నిపుణులను సంప్రదించాలి.