Tap to Read ➤

రకుల్ అందాల రహస్యాలేంటో తెలుసా...

పొడుగు కాళ్ల సుందరి రకుల్ ప్రీత్ సింగ్ లా అందంగా కనిపించాలంటే ఇవి ట్రై చేయండి....
ఇటీవల బాలీవుడ్ లో అజయ్ దేవ్ గన్ తో కలిసి నటించిన ఈ పంజాబీ పోరి ఫొటో షూట్ తన బ్యూటీ సీక్రెట్స్ ఏంటో రివీల్ చేసింది.
తను రోజూ అందంగా, ఫిట్ గా ఉండేందుకు కారణం ఏంటో మీడియా ప్రతినిధులకు చెప్పేసింది... ఆ విశేషాలేంటో ఇప్పుడే చూసేయండి...
తను అందంగా ఉండేందుకు ప్రత్యేకమైన పద్ధతులేవీ పాటించనని.. ఆరోగ్యంగా ఉంటే అందరూ అందంగా కనిపిస్తారని చెబుతోంది...
అయితే తను ఆరోగ్యంగా ఉండేందుకు మాత్రం రెగ్యులర్ గా వర్కౌట్లు చేస్తానని చెప్పేసింది ఈ అందాల భామ..
ఈ పంజాబీ ముద్దుగుమ్మ తన అందాన్ని మరింత పెంచుకునేందుకు తన బాడీలోని ఆ భాగంలో సర్జరీ చేయించుకుందని.. సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి.
తన పెదాలను గమనిస్తే.. ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుందని.. మరింత అద్భుతమైన లుక్ కోసమే ఈ అమ్మడు లిప్స్ సర్జరీ చేయించుకుందని అనుకుంటున్నారు.
సాధారణంగా హీరోయిన్లు తమ అందాన్ని పెంచుకునేందుకు ముక్కుకు సంబంధించిన సర్జరీలు చేసుకుంటూ ఉంటారు.
ఇంకా కొందరు తమ పెదాలను మార్చుకుంటూ ఉంటారు. తమ పెదాలు అందంగా కనిపించేందుకు చేయించుకునే సర్జరీనే పౌట్ అంటారు.
బాలీవుడ్ హీరోయిన్లు ఇలాంటివి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఇప్పడు రకుల్ కూడా అదే బాటలో పయనించిందని చెబుతున్నారు. అయితే రకుల్ ఈ విషయాలపై స్పందించలేదు