Tap to Read ➤

హ్యాపినెస్ లో మన ర్యాంకు ఎంతంటే...

సంతోషం ప్రాముఖ్యతను యావత్ ప్రపంచానికి తెలియజేస్తూ.. ప్రతి ఏటా మార్చి 20వ తేదీన ‘అంతర్జాతీయ సంతోష దినోత్సవం’గా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.
Venkatesh S
యావత్ ప్రపంచంలో ఉన్న అతి పెద్ద సమస్యలు ఆకలి, చదువు లేకపోవడం, అవగాహన లేకపోవడం, మానవ హక్కుల ఉల్లంఘన వంటివి అంతం చేయడానికి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఈ సంతోష దినోత్సవ తీర్మానానికి 2012 జులై 21వ తేదీన ఆమోదం లభించింది. ఈ తీర్మానాన్ని తొలిసారిగా భూటాన్ ప్రతిపాదించడం విశేషం. అనంతరం 2013వ సంవత్సరం నుండి ఐక్యరాజ్య సమితి ఆనందం ప్రాముఖ్యతను తెలియజేశారు.
కొన్ని నివేదికల ప్రకారం, 2022 సంవత్సరంలో అత్యంత ఆనందంగా
ఉండే దేశాల్లో ఫిన్లాండ్ కు
 నెంబర్ 1 స్థానం దక్కింది. రెండో స్థానంలో డెన్మార్క్ నిలిచింది.
ఆ తర్వాతి స్థానాల్లో ఐస్ ల్యాండ్, స్విట్జర్లాండ్ నిలిచాయి. ఇక మన దేశం విషయానికొస్తే, భారతదేశానికి 136వ స్థానం దక్కింది. గతేడాది 139వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు మూడు స్థానాలు ఎగబాకింది.
జాతీయ ఆదాయం కంటే జాతీయ ఆనందం ముఖ్యమని భూటాన్ ప్రతిపాదించడం విశేషం. దీంతో సంతోషం యొక్క ప్రాధాన్యత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
హ్యాపీనెస్ డే 2022 యొక్క థీమ్ ‘ప్రశాంతంగా ఉండండి.. తెలివిగా జీవించండి.. మరియు దయతో ఉండండి’.
మీకు ఈ ప్రపంచం పట్ల ఏ మాత్రం బాధ్యత ఉన్నా.. మీరు చేయాల్సిన మొట్టమొదటి పని మిమ్మల్ని మీరు హ్యాపీగా గడిపేలా చేసుకోవడం.
మనలో చాలా మంది హ్యాపీగా ఉండకపోవడానికి ప్రధాన కారణం, దానికి కావాల్సిన పరిజ్ణానం వారి వద్ద లేకపోవడమే.