Tap to Read ➤

కలకత్తాలోనూ కనువిందు చేసిన RRR టీమ్..

మార్చి 25వ తేదీన RRR సినిమా రిలీజ్ సందర్భంగా భారతదేశంలోని ప్రముఖ నగరాలన్నీ తిరుగుతూ.. సందడి చేస్తున్నారు జక్కన్న, చెర్రీ తారక్..
Venkatesh S
కలకత్తాలో హౌరా బ్రిడ్జి వద్ద సందడి చేసిన RRR టీమ్.. దేశ వ్యాప్తంగా సినిమా ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
కలకత్తాలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళికి ఘన స్వాగతం లభించింది..
RRR హీరోలు రామ్ చరణ్ తేజ, నందమూరి తారక రామారావు, దర్శక ధీర రాజమౌళికి దేశ వ్యాప్తంగా  ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. ఇది బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందని చెబుతున్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా RRR సినిమా గురించే చర్చ జరుగుతోంది.. అలాంటి పరిస్థితులను క్రియేట్ చేశారు మన దర్శక ధీరుడు జక్కన్న, తారక్, చెర్రీ..
కలక్తాలో చేతులు కలిపి తమ మధ్య స్నేహ బంధం గురించి ప్రపంచానికి చాటి చెబుతున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్... స్నేహమంటే మాదేనని.. మా తర్వాతే ఎవరిదైనా అని ఘంటా పథంగా చెబుతున్నారు.
RRR హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కలకత్తాలో తన అభిమానుల కోసం ఫోన్లో సెల్ఫీ ఫొటోలకు అవకాశం కల్పించడంతో అభిమానులు చాలా హ్యాపీగా ఫీలయ్యరు..
RRR హీరోలతో పాటు జక్కన్న కూడా స్టైలీష్ డ్రస్సులను వేస్తూ.. ఫుట్ వేర్ విషయంలోనూ వారితో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్నారు..