Tap to Read ➤

తన స్పిన్ తో షేన్ వార్న్ ప్రపంచ క్రికెట్ నే శాసించాడు...

ఆసీస్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దాదాపు 15 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్లో తన మణికట్టుతో ప్రపంచ క్రికెట్ ను శాసించిన వారిలో ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఒకరు. ఈయన మార్చి 4వ తేదీన శుక్రవారం నాడు హఠాన్మరణం చెందారు.
2008 సంవత్సరంలో తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు తనే కెప్టెన్ గా ఉన్నారు.
షేన్ వార్న్ బంతి పట్టుకున్నాడంటే.. ఎలాంటి బ్యాట్స్ మెన్ అయినా బోల్తా పడాల్సిందే.. ప్రత్యర్థి టీమ్ ఏదైనా.. ఎంత హిట్టర్ అయినా.. తన స్పిన్ మాయాజాలం ముందు తలోంచాల్సిందే..
తను వేసే బంతి, పిచ్ పై పడిన వెంటనే బ్యాట్స్ మెన్ గమనించేలోపే స్టంప్స్ లోపలికి దూసుకెళ్లేది. చాలా సందర్భాల్లో బ్యాటర్లు తాము ఎలా అవుటయ్యామా అని ఆశ్చర్యపోయేవారు.
ఒకప్పుడు బౌలింగ్ అంటే కేవలం పేసర్లకే.. స్పిన్నర్లకు అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు. అలాంటి సమయంలో తన మణికట్టుతో స్పిన్ బౌలింగుకు కొత్త జీవం పోసిన వారిలో షేన్ వార్న్ ముందుంటాడు.
తన చేతి నుండి ఎప్పుడు లెగ్ బ్రేక్, ఫ్లిప్పర్, జూటర్, స్లయిడర్, టాపీ, బ్యాక్ స్పిన్నర్.. ఇలా ఏ పేరుతో వచ్చినా.. బ్యాట్స్ మెన్ పెవిలియన్ బాట పట్టాల్సిందే.
1993 సంవత్సరంలో జూన్ 4వ తేదీన తొలి యాషెస్ టెస్టు మ్యాచ్ లో షేన్ వార్న్ వేసిన తొలి బంతికే ఇంగ్లాండ్ బ్యాటర్ గ్యాటింగ్ ను బౌల్డ్ చేసేశాడు.
షేన్ వార్న్ కేవలం టెస్టుల్లోనే కాదు వన్డేల్లోనూ అసాధారణ ప్రతిభను కనబరిచాడు. 1996, 1999 వన్డే వరల్డ్ కప్ సీరిస్ లో తన పదునైన బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్లను ముప్పుతిప్పలు పెట్టాడు.
షేన్ వార్న్ క్రికెట్ జీవింతో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. పిచ్ గురించి నివేదికలను అందజేసి డబ్బులు తీసుకోవడం, లంకేయులపై తీవ్రమైన కామెంట్లు చేసి రెండు మ్యాచుల సస్పెన్షన్ కు గురయ్యాడు.