ఏప్రిల్ నెలలో తొలి సూర్య గ్రహణం సమయంలో ద్వాదశ రాశులలోని కొన్ని రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. అందులో మీ రాశి ఉందేమో చూడండి...
2022 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 30వ తేదీన శనివారం అర్థరాత్రి 12:15 గంటలకు(భారత సమయం ప్రకారం) తొలి సూర్య గ్రహణం ఏర్పడనుంది.
ఆ మరుసటి రోజు అంటే మే ఒకటో తేదీన ఉదయం 4:07 గంటల వరకు ఉంటుది. అంటే ఇది పాక్షిక గ్రహణంగా మేషరాశిలో ప్రారంభమవుతుంది.
సూర్య గ్రహణాన్ని కొందరు అశుభకరంగా భావిస్తారు. అందుకే గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. దేవాలయాలు కూడా పూర్తిగా మూసివేస్తారు.
వీటన్నింటి సంగతి పక్కనబెడితే ఏప్రిల్ నెలలో తొలి సూర్య గ్రహణం సమయంలో ద్వాదశ రాశులలోని కొన్ని రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయట.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2022లో ఏప్రిల్ 30వ తేదీన శనివారం నాడు మేష రాశిలో సూర్య గ్రహణం ఏర్పడే సమయంలో ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో ఉద్యోగులు కోరుకున్న ఫలితాలను పొందొచ్చు. మరికొందరికి ప్రమోషన్ లభిస్తుంది.
కర్కాటక రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. కర్కాటక రాశి ఉద్యోగులు తమ కెరీర్లో మంచి పురోగతిని సాధిస్తారు.
తుల రాశి వారికి సూర్య గ్రహణం సంభవించే సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులకు కొత్త కొత్త అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి.
ధనస్సు రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో మంచి ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో ప్రభుత్వ శాఖకు సంబంధించి చేసే పనుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.