Tap to Read ➤

2022 ఏప్రిల్ లో సూర్య గ్రహణం ఎప్పుడు?

2022లో తొలి సూర్యగ్రహణాన్ని ఎక్కడ చూడొచ్చు.. భారతదేశంలో సూర్య గ్రహణ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది...
Venkatesh S
ఖగోళ శాస్త్రం ప్రకారం, 2022 సంవత్సరంలో మొత్తం రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఉంటాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, వీటిని చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు.
శాస్త్రవేత్తల ప్రకారం.. సూర్యునికి మరియు భూమికి మధ్య చంద్రుడు వెళ్లినప్పుడు, చంద్రుడు సూర్యుని కాంతిని భూమిని చేరకుండా కొంత సమయం పడుతుంది.
2022 సంవత్సరంలో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 30వ తేదీన శనివారం నాడు దక్షిణ మరియు పశ్చిమ అమెరికా, పసిఫిక్ మహా సముద్రం, అట్లాంటిక్, అంటార్కిటిక్ మహాసముద్రంలో సంభవిస్తుంది.
2022లో సంభవించే రెండు సూర్య గ్రహణాలలో ఇది మొదటిది. రెండో సూర్య గ్రహణం 25వ తేదీన ఏర్పడనుంది.
ఏప్రిల్ 30న సూర్య గ్రహణం చంద్రుడు భూమికి అత్యంత దూరంలో చేరుకోవడానికి కేవలం నాలుగు రోజుల ముందే ఇది సంభవిస్తుంది.
2022 సంవత్సరంలో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 30వ తేదీన శనివారం నాడు దక్షిణ మరియు పశ్చిమ అమెరికా, పసిఫిక్ మహా సముద్రం, అట్లాంటిక్, అంటార్కిటిక్ మహాసముద్రంలో ఏర్పడటం వల్ల.. మన దేశంలో సూర్య గ్రహణం కనిపించదు.
సూర్య గ్రహణానికి ముందు స్నానం చేయండి. గ్రహణం సమయంలో కత్తెర, కత్తులు వంటి పదునైన వస్తువులను వాడకూడదు. సూర్య గ్రహణం సమయంలో ఏదైనా పని చేసే ముందు జ్యోతిష్యులను సంప్రదించండి.