Tap to Read ➤

ఎండాకాలంలో మెరిసే చర్మం కావాలా?

చర్మం అందంగా, యవ్వనంగా, మెరిసిపోతూ కనిపించాలంటే ఈ మూడు పదార్థాలతో ప్రిపేర్ చేసిన ప్యాక్ వేసుకోవాల్సిందే.
చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మన ఫేసులో గ్లో కనిపిస్తుంది. అందుకే చర్మాన్ని క్లెన్సింగ్, మాయిశ్చరైజ్, టోనింగ్ చేసుకోవడం అనేవి మన స్కిన్ కేర్లో భాగమై ఉంటాయి.
మనం ఏదైనా బ్యూటీ పార్లర్ కు వెళ్లినప్పుడు, తను కూడా మన స్కిన్ కు తగ్గట్టు ఫేషియల్ చేస్తుందనే గ్యారంటీ లేదు.
ఒకవేళ ఆ సమయంలో స్కిన్లో గ్లో కనిపించినా.. అది తాత్కాలికంగానే ఉంటుంది. ఒకవేళ మేకప్ వేసుకున్నా.. దాని వల్ల మన స్కిన్ హెల్త్ పాడవుతుంది. స్కిన్ న్యాచురలిటీని కోల్పోతుంది.
అలాగని మేకప్ లేకుండా బయటకు వెళ్లడం కూడా కష్టమే. ఇలాంటి సమయంలో ఏమి చేయాలని చింతిస్తున్నారా? ఇందుకు పరిష్కారం మా దగ్గర ఉంది.
మీరు రెగ్యులర్ గా వంటింట్లో, తోటల్లో ఉపయోగించే వాటితో మీ చర్మ సౌందర్యాన్నిపెంచుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి...
ముందుగా ఒక టీ స్పూన్ కలబంద(aloe-vera) గుజ్జు, రెండు టీ స్పూన్ల తాజా రోజ్ వాటర్, పసుపు పొడిని ఒక టీ స్పూన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత ఫేస్ కి అప్లై చేయాలి.
25 నుండి 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.. మీరు కోరుకున్న చర్మం వచ్చేస్తుంది.
మీరు వాడే తాజా రోజ్ వాటర్ తో మీ చర్మాన్ని సూర్యుని హానికరమైన కిరణాల నుండి కాపాడటంలో సహాయపడుతుంది. అలాగే కలబందలో ఉండే హీలింగ్ మరియు ఓదార్పు లక్షణాలు సూర్యరశ్మి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.
తాజా రోజా మరియు కలబంద మిశ్రమం మీ ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలను తొలగించడం, చర్మాన్ని తేమగా ఉంచడం, చర్మాన్ని శుభ్రంగా మరియు తాజాగా ఉంచడం, నల్లటి వలయాలు, ముడతలను తొలగించడం, చర్మంపై పిహెచ్ బ్యాలెన్స్ కాపాడటంలో తమ వంతు పాత్ర పోషిస్తాయి.