Tap to Read ➤

వినీతా సింగ్ సక్సెస్ స్టోరీ...

షుగర్ కాస్మోటిక్స్ కంపెనీ సిఇఒ వినీత విజయగాథ గురించి తెలుసుకుందామా...
షుగర్ కాస్మోటిక్స్ కంపెనీ సిఇఒ వినీత విజయగాథ గురించి తెలుసుకుందామా...
వినీత సింగ్ 23 ఏళ్ల వయసులో కోటి రూపాయల ఆఫర్ ను తిరస్కరించింది. ఎందుకంటే తను సొంత కంపెనీ ప్రారంభించాలనుకునేదట.
తన జీవితంలో అతి పెద్ద రిస్క్ తీసుకుంటున్నానని తెలిసినా తన నిర్ణయాన్ని మార్చుకోకుండా తన కలను సాకారం చేసుకునేందుకు
ఎంతగానో కృషి చేసింది.
వినీతా సింగ్ భర్త కౌశిక్ ముఖర్జీతో కలిసి 2012 సంవత్సరంలో షుగర్ కాస్మోటిక్స్ ను ప్రారంభించారు. 2019-2020 సంవత్సరంలో వారి బ్రాండ్ బిజినెస్ రూ.100 కోట్ల మార్కును దాటింది.
వినీతా సింగ్ ఢిల్లీలో జన్మించారు. మద్రాసు ఐఐటిలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశారు. ఆ తర్వాత ఐఐఎం అహ్మదాబాదులో ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం వినీత సింగ్ తన కలను నెరవేర్చుకోవడానికి ముందుగా ముంబైకి వచ్చింది.
ప్రస్తుతం ధనవంతుల జాబితాలో వినీతా సింగ్ కూడా చేరిపోయింది. తన నికర విలువ గురించి చెప్పాలంటే, ఆమెకు ఏడాదికి దాదాపు 300 కోట్ల రూపాయలు వస్తున్నట్లు సమాచారం.
షార్క్ టాంక్ అనే బిజినెస్ రియాలిటీ షోలో న్యాయనిర్ణేత పాత్ర కోసం ఒక్కో ఎపిసోడ్ కు వినీతా సింగ్ దాదాపు 5 నుండి 6 లక్షల రూపాయలు తీసుకుంటున్నారట.
2013 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో జరిగిన అల్ట్రా మారథాన్ లో కూడా ఆమె పాల్గొన్నారు. అక్కడ డౌన్ రన్ పూర్తి చేసినందుకు తనకు బ్యాక్ టు బ్యాక్ మెడల్స్ కూడా దక్కాయట.