Tap to Read ➤

రాహువు-కేతువుల సంచారం.. ఈ 5 రాశులకు నష్టం...

రాహువు, కేతువు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ ఏకకాలంలో రాశిచక్రాల్లో మారుతూ ఉంటాయి. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 12న మేషరాశిలో సంచారం చేయనున్నాయి.
ఈ కాలంలో మేషరాశిని కుజుడు పాలించనున్నాడు. అదే రోజు కేతువు శుక్రుడు పాలించే తులరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ రెండు రాశులలో సుమారు 18 నెలల పాటు రాహువు, కేతువు నివాసం ఉండనున్నారు.
ఈ సమయంలో ద్వాదశ రాశులలో నాలుగు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఆ రాశిచక్రాలేవో ఇప్పుడు తెలుసుకుందాం...
మేష రాశి వారు రాహు, కేతువుల రవాణా సమయంలో ఇతరులతో రిలేషన్ షిప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
తుల రాశి నుండి రాహువు ఏడో స్థానంలోను, కేతువు తొలి స్థానంలో సంచరిస్తారు. ఈ కాలంలో తుల రాశి వారు ఆర్థిక పరమైన విషయాల్లో, ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి వారికి రాహు, కేతువుల రవాణా వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురుకావొచ్చు. ఈ కాలంలో మీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందొచ్చు. ఈ కాలంలో మీరు అనవసరమైన ఖర్చు చేయాల్సి వస్తుంది.
మకర రాశి నుండి రాహు-కేతువులు నాలుగు, పదో పాదం గుండా ప్రయాణించనున్నారు. ఈ నేపథ్యంలో కేతువు రవాణా ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను తీసుకొస్తుంది. కానీ రాహు రవాణా మాత్రం ప్రతికూల ఫలితాలను తీసుకురావచ్చు.
మీన రాశి వారికి రాహు-కేతుల సంచారం వల్ల ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆరోగ్య పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
ఈ 5 రాశుల వారు రాహు-కేతువుల ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం పొందాలంటే కొన్ని పరిహారాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ లైఫ్ స్టైల్ ను కొంత మార్చుకోవాలి. ప్రతిరోజూ యోగా చేయాలి. ఉదయాన్నే స్నానం చేసిన అనంతరం తులసి ఆకులను తినాలి. చందన తిలకాన్ని క్రమం తప్పకుండా వాడాలి.