ఈ రోజుల్లో ఫిట్‌ నెస్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పదం ప్రోటీన్. బరువు తగ్గాలనుకునే వారు, జిమ్‌ లో కండలు పెంచాలనుకునే వారు.. ఇలా ఎవరైనా సరే తమ డైట్‌ లో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. ఉదయం బ్రేక్‌ ఫాస్ట్ మొదలుకుని రాత్రి డిన్నర్ వరకు ప్రోటీన్ షేక్స్, సప్లిమెంట్లపై ఆధారపడుతున్నారు.

Advertisement

శరీరానికి ప్రోటీన్ ఎంత ఎక్కువ అందిస్తే అంత దృఢంగా మారతామనేది ఒక ప్రబలమైన నమ్మకంగా మారిపోయింది. అయితే మనం గుడ్డిగా ఫాలో అవుతున్న ఈ ట్రెండ్‌పై ఒక తాజా అధ్యయనం తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.

Advertisement

ప్రముఖ సైన్స్ జర్నల్ సెల్ ప్రెస్ లో ప్రచురితమైన ఒక తాజా పరిశోధన ప్రకారం.. ప్రతిఒక్కరూ మోతాదుకు మించి ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం లేనే లేదు. అధ్యయన రచయితలు బెయిలీ ఎ. నాఫ్, డడ్లీ డబ్ల్యూ. లేమింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మధ్య కాలంలో హై ప్రోటీన్ డైట్ అనేది ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. కానీ, మోతాదుకు మించి ప్రోటీన్ తీసుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.

వాస్తవానికి ప్రోటీన్ వినియోగాన్ని మితంగా ఉంచుకోవడం వల్ల శరీర జీవక్రియల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవని, దీర్ఘాయువు సొంతమవుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఎవరి శరీర అవసరాలకు తగ్గట్టుగా వారు ప్రోటీన్ తీసుకోవాలి తప్ప, అందరూ ఒకేలా పోటీపడి తినకూడదు.

Advertisement

అసలు శరీరంలోకి ఎక్కువ ప్రోటీన్ వెళితే ఏమవుతుంది?

మనం హద్దు మీరి ప్రోటీన్ తీసుకున్నప్పుడు, అది మన శరీరంలోని mTORC1 అనే వ్యవస్థను అతిగా ఉత్తేజపరుస్తుంది. ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం కణాల పెరుగుదలను ప్రోత్సహించడం. కానీ, మోతాదుకు మించిన ప్రోటీన్ వల్ల ఇది ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండిపోతుంది. ఫలితంగా కణాలు తమను తాము శుభ్రపరచుకునే, మరమ్మత్తు చేసుకునే సమయం దొరకదు. ఒక యంత్రం సర్వీసింగ్ లేకుండా ఏకధాటిగా పనిచేస్తే ఎలా పాడైపోతుందో, మన శరీరం కూడా తనను తాను రిపేర్ చేసుకునే అవకాశం లేకుండా నిరంతరం పనిచేసి త్వరగా అలిసిపోతుంది. దీనివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుంది.

Advertisement

పిత్తులు వేసే వాళ్లని చూసి నవ్వుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి..
మరి ప్రోటీన్ పూర్తిగా మానేయాలా?

అలాగని ప్రోటీన్ తీసుకోవడం పూర్తిగా మానేయమని ఈ అధ్యయనం చెప్పడం లేదు. శరీరానికి ప్రోటీన్ అవసరమే, కానీ సరైన మోతాదులో మాత్రమే. ముఖ్యంగా మెథియోనిన్ (Methionine) అనే అమైనో యాసిడ్ ఎక్కువగా ఉండే ప్రోటీన్లను పరిమితంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సరైన రకమైన ప్రోటీన్‌ ను ఎంచుకోవడం ఇక్కడ కీలకం.

మరి ఎంత ప్రోటీన్ అవసరం?

సాధారణంగా ఒక వ్యక్తి తన శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు 1.2 నుండి 1.6 గ్రాముల ప్రోటీన్‌ను మాత్రమే తీసుకోవాలని ఈ అధ్యయనం సిఫార్సు చేస్తోంది. దీనిని బట్టి అందరికీ అధిక ప్రోటీన్ ఆహారం అవసరం లేదని స్పష్టమవుతోంది.