Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
మనం పుట్టక ముందే ఈ విషయాలు నిర్ణయించబడతాయ్..! వీటిని ఎవ్వరూ మార్చలేరు..!
ఒక చెట్టులోంచి ఎలాంటి పళ్లు వస్తాయో ఆ విత్తనాన్ని బట్టి వుంటుంది. అలాగే మనం పుట్టక ముందే కొన్ని విషయాలు నిర్ణయించబడతాయని హిందూ శాస్త్రం చెబుతోంది. చనిపోయేంత వరకు ఈ విషయాలను ఎవ్వరూ మార్చలేరు. దీనికి జ్యోతిష్య శాస్త్రం కూడా ఒక ఉదాహరణ. మనిషి పుట్టే కాలం, తేదీని బట్టి ఏ రాశిలో పుట్టారు, ఏ నక్షత్రంలో పుట్టారో జ్యోతిష్యం చెబుతుంది. దీని ఆధారంగానే పుట్టిన ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని ముండే పండితులు చెబుతారు. జీవితంలో వీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో కూడా చెబుతారు. గ్రహాలు వీరిపై ఎప్పుడు ఎలా ప్రభావం చూపితాయన్న విషయాన్ని ముందుగానే బయట పెడతారు.
ఇదే విధంగా పుట్టకముందే కూడా కొన్ని విషయాలను నిర్ణయించబడతాయ్. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుట్టక ముందే ఒక మనిషి ఎక్కడ జన్మించాలో నిర్ణయించబడుతుంది. ఇది ఎవ్వరి చేతిలో లేదు. కేవలం ఆ విధి చేతిలోనే వుందని శాస్త్రం చెబుతోంది. ఎవరికి నచ్చిన ప్రదేశంలోనే వారు జన్మించాలనుకుంటే ఇక అప్పుడు అందరూ ధనవంతులు, ఘ్నానులుగానే పుట్టేలా నిర్ణయం తీసుకుంటారు. విధే మనం ఎక్కడా పుట్టాలో నిర్ణయిస్తుంది. ఇదంతా పూర్వ జన్మల కర్మాన్ని బట్టి వుంటుంది. కర్మ ఫలం ఎలా వుంటే అలా పుడతారు. మనం చేసిన ఖర్మల ఆధారంగానే మన భవిష్యత్తు ఆధారపడి వుంటుంది.

వివాహం ఎప్పుడు, ఎవరితో జరగాలనేది కూడా ముందగానే నిర్ణయించబడి వుంటుందని శాస్త్రం చెబుతోంది. మనం అనుకున్న వారితో కాకుండా వేరే వారితో వివాహం జరిగిపోతుంది. ఇది కూడా విధి వల్లే నిర్ణియించబడిందని శాస్త్రం చెబుతుంది. కొందరికి అసలు వివాహమే జరగదు. ఇది కూడా పూర్వ జన్మలో చేసుకున్న ఖర్మ వల్లే అని పిండితులు చెబుతున్నారు.
మానవుని వద్ద ఎంత ధనం వుండాలనేది కూడా విధాత ముందే నిర్ణయిస్తాడని అంటున్నారు. అందరూ ధనవంతులు కావాలనుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. కేవలం కొంత మందకి మాత్రమే ధనవంతులయ్యే అవకాశం వుంటుంది. కొందరు ఉన్నట్టుండి ధనవంతులుగా మారిపోతారు. మరికొంతమంది ఏ పనిచేయకపోయినా నిధులు దొరికి గొప్పవారిగా మారిపోతారు. కొందరికి వారసత్వంగా ధనం వస్తుంది. ఇదంతా పుట్టకముందే నిర్ణయించబడుతుంది.
గరువు ఘ్నానాన్ని బోధించేటప్పుడు అందరూ ఒకేలా అర్ధం చేసుకోరు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అర్ధం చేసుకుంటారు. అందరికీ సమానమైన కళ్లు, ముక్కు, చేతులు ఇచ్చినా అందరూ సమానంగా ఆలోచించలేకపోతున్నారు. ఇది కూడా విధి ముందే నిర్ణయించిందని శాస్త్రం చెబుతోంది.
మృత్యువు ఏ వయసులో, ఎక్కడ, ఎలా జరగాలనేది కూడా ముందుగానే నిర్ణయించబడి వుంటుందని శాస్తం చెబుతోంది. మృత్యువు కూడా జన్మించక ముందే నిర్ణయించబడి వుంటుంది. కొంతమందికి చిన్న వయసులోనే మృత్యువు వస్తోంది. మరికొంత మంది అనారోగ్యంతో బాధపడుతూ మరణిస్తారు. ఇక కొంతమందైతే వేరే వారి చేతిలో మరణిస్తారు. ఇదంతా పుట్టక ముందు నుంచే నిర్ణయించబడి వుంటుందని శాస్త్రం చెబుతోంది.
పైన చెప్పిన విషయాలన్నీ పూర్వ జన్మలో చేసిన కర్మల ఆధారంగానే నిర్ణయించబడతాయ్. ఈ జన్మలో పాపాలకు శిక్ష అనుభవించకపోతే, వచ్చే జన్మలో అయినా ఆ పాపాలకు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందేనని పండితులు చెబుతున్నారు. కర్మ సిద్ధాంతాన్ని ఎవ్వరూ మార్చలేరు. అది ఎప్పటికైనా తిరిగి వస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications