Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఏ రాశివారు ఏ విషయాల్లో ఒత్తిడికి గురవుతారంటే?
వృత్తి, వ్యాపారాల్లో పని ఒత్తిడి, కుటుంబ సమస్యలతో ఒత్తిడి, సామాజిక ఒత్తిడి చాలా మందికి ఉంటుంది. అయితే ఆ ఒత్తిడిని ఎలా తీసుకున్నామన్నదే ముఖ్యం. కొందరు లైట్ తీసుకుంటారు, కానీ కొందరు విపరీతంగా ఆలోచిస్తూ ఒత్తిడిని అనుభవిస్తుంటారు. కొందరికి కొన్ని విషయాల్లో విపరీతమైన ఒత్తిడి అనుభవిస్తారు, మరికొందరు ఇతర విషయాల్లో ఒత్తిడి ఫీలవుతారు.
జ్యోతిష్యం ప్రకారం ఏ రాశి వారు ఏయే విషయాల్లో ఒత్తిడిని అనుభవిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి:
మేష రాశి వారు ఒకే సమయంలో ఒకే పని చేయడానికి ఇష్టపడతారు. ఇలాంటి వారికి ఒకేసారి ఎక్కువ పనుల బాధ్యత అప్పగిస్తే చాలా ఒత్తిడికి గురవుతారు. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడతారు. దీని వల్ల ఏ పనీ సవ్యంగా పూర్తి చేయలేరు.
వృషభ రాశి:
వృషభ రాశి వారు సమస్యలను పరిష్కరించగలరు. కానీ దానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. వారు అనుకున్నట్లే జీవితం సాగిపోవాలనుకుంటారు. ఏదైనా అనుకోనిది జరిగితే ఒత్తిడికి గురవుతారు. కొత్త సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఇంతలో పుణ్యకాలం పూర్తవుతుంది.
మిథునరాశి:
మిథునరాశి వారికి జీవితంలో సాఫీగా సాగిపోవాలి. ఏదైనా ఒడిదొడుకులు ఎదురైతే ఒత్తిడి అనుభవిస్తారు.
కర్కాటక రాశి:
అనుకోని సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించడానికి చాలా ఇబ్బంది పడతారు. వారు అనుకున్నది ఒకటి, జరిగేది వేరొకటి కావడం వల్ల తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తాు.
సింహ రాశి:
సింహ రాశి వారు ఎప్పుడూ అందరి దృష్టిలో ఉండాలని, ప్రత్యేకంగా నిలవాలని కోరుకుంటారు. అలా ఉండలేకపోయినా, ఇతరులు తమను అధిగమనిస్తున్నా తట్టుకోలేరు. ఒత్తిడికి గురవుతారు.
కన్య రాశి:
కన్య రాశి వారికి ఆలోచనలు ఎక్కువ. కాస్తంత సమయం దొరికితే ఆలోచనల్లో మునిగిపోతారు. అలా సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురవుతారు. భావోద్వేగాలు ఎక్కువ. చుట్టు ఉన్న వారి సమస్యలకు కూడా ఎక్కువగా ఫీలైపోతుంటారు.
తుల రాశి:
తుల రాశి వారు జీవితం సంతోషంగా, సాఫీగా సాగాలని కోరుకుంటారు. అలాగే ఇతరుల పట్ల ప్రత్యేక దృష్టిని సంపాదించుకోవాలనుకుంటారు. అలా జరగనప్పుడు ఒత్తిడికి గురవుతారు.
వృశ్చిక రాశి:
ప్రియమైన వారు దూరమైనప్పుడు, ఇష్టపడ్డవారు కాదన్నప్పుడు వృశ్చిక రాశి వారు తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తారు. బాధతో కుమిలిపోతారు. బాధ ఒత్తిడిని మరింత తీవ్రం చేస్తుంది.
ధనుస్సు రాశి:
ఎవరైనా తమపై ఆజమాయిషీ చెలాయిస్తే ధనుస్సు రాశి వారు సహించలేరు. చెప్పిన పని చెప్పినట్లే చేయాలని ఆదేశాలిచ్చే వారి వల్ల ఒత్తిడికి గురవుతారు.
మకర రాశి:
తమ జీవితంలో ఏదైనా అనుకోనిది జరిగితే చాలా ఒత్తిడికి గురవుతారు. జీవితంలో ఫెయిల్ అయిపోతున్నామని, కింద పడిపోతున్నామని తెగ ఫీలవుతారు.
కుంభరాశి:
కుంభ రాశి వారు తమకు సమస్యలు వచ్చినప్పుడు కాస్తంత ఒత్తిడికి గురవుతారు. అయితే ఇతరుల సమస్యలను కూడా ఫీలవుతూ ఒత్తిడిని అనుభవిస్తారు. పక్క వారి గురించి ఆలోచించి మదనపడుతుంటారు.
మీనరాశి:
మీన రాశి వారు చాలా భావోద్వేగభరితంగా ఉంటారు. ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచిస్తారు. దీని వల్ల ఒత్తిడి అనుభవిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications