Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ రాశుల వాళ్లు పొరపాటున కూడా బంగారం జోలికి వెళ్లకండి..గోల్డ్ ధరిస్తే ఏమవుతుందంటే..
బంగారం అంటే ఇష్టం ఉండనిది ఎవరికి చెప్పండి. ముఖ్యంగా మహిళలకు అది కూడా మనదేశ మహిళలకు అయితే బంగారం పెద్ద క్రేజ్ గా ఉంటుంది. బంగారం... కేవలం లోహం కాదు ఇది సంపదకు చిహ్నం, సౌభాగ్యానికి ప్రతిరూపం. బంగారు ఆభరణాలు ధరించినవారికి అదనపు అందాన్నిస్తాయి. బంగారానికి జ్యోతిష్యశాస్త్రంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది అన్ని గ్రహాలతో ఏదో ఒక విధంగా ముడిపడి ఉన్నప్పటికీ ముఖ్యంగా గురు గ్రహంతో దీనికి అవినాభావ సంబంధం ఉంది. బంగారం శక్తిని, వేడిని ఉత్పత్తి చేయగలదు. అంతేకాదు కొన్ని విషపూరిత ప్రభావాలను సైతం నాశనం చేసే శక్తి దీనికి ఉంది.
మన జాతకంలోని గ్రహాల స్థానం సరిగా లేనప్పుడు, సంపద వృద్ధి చెందకపోయినా లేదా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా జ్యోతిష్య శాస్త్రం కొన్ని ప్రత్యేకమైన రత్నాలను, లోహాలను ధరించమని సూచిస్తుంది. వాటిలో బంగారం కూడా ఒకటి. బంగారం సిరిసంపదలకు సూచనగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా ఇది మన భవిష్యత్తును కూడా నిర్దేశిస్తుందని నమ్ముతారు. అయితే, బంగారం ధరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధరించడం వల్ల జాతకంలో గురు గ్రహం బలపడుతుంది.. ఫలితంగా జీవితంలో సంపద మరియు ఆనందం వెల్లివిరుస్తాయి.అయితే అందరూ బంగారం ధరించకూడదు. కొన్ని రాశుల వారికి బంగారం ధరించడం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కానీ మరికొందరు మాత్రం ఒంటిపై బంగారం పెట్టుకుంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఏ రాశుల వారు బంగారం ధరించకూడదు
వృషభ రాశి
మీ రాశికి అధిపతి అందమైన శుక్రుడు. వృషభ రాశి వారు బంగారు ఆభరణాలు ధరించడం అంత మంచిది కాదు. ఎందుకంటే, మీరు ఎక్కువగా బంగారాన్ని ధరించినట్లయితే మీ జీవితంలో అనేక చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఊహించని సమస్యలు వచ్చి మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. అంతేకాదు, మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతాయి. ఆర్థికంగా కూడా మీరు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇది మాత్రమే కాదు మీ హృదయానికి దగ్గరైన వారితో మీ సంబంధాలలో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు ప్రేమగా ఉన్న బంధాలు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ మెరిసే బంగారానికి దూరంగా ఉంటేనే మీ జీవితం ప్రశాంతంగా సాగుతుంది.
బుధుడి మహిమ..ఈ 3 రాశులు ఇకపై వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు,సిరి సంపదలు
మిథున రాశి
మీ రాశిని పాలించే గ్రహం తెలివైన బుధుడు. మీరు పొరపాటున కూడా బంగారు ఆభరణాల మోజులో పడకండి. ఎందుకంటే ఒకవేళ మీరు బంగారాన్ని ధరిస్తే మీ వ్యాపారంలో ఊహించని నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. ఇతర ఆర్థిక లావాదేవీలు కూడా మీకు కలిసిరాకపోవచ్చు. అంతేకాదు బంగారం ధరించడం వల్ల మీ దగ్గర డబ్బు నిలవదని, అది నీటిలా ఖర్చైపోతుందని కూడా నమ్ముతారు. కాబట్టి, మిథున రాశి వారు ఈ మెరిసే లోహానికి ఎంత దూరంగా ఉంటే మీ ఆర్థిక భవిష్యత్తు అంత భద్రంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
మీ రాశికి అధిపతి ధైర్యవంతుడైన కుజుడు. బంగారం అంగారక గ్రహానికి, తేజోవంతుడైన సూర్యుడికి శత్రు గ్రహం. ఒకవేళ మీరు ఎక్కువగా బంగారాన్ని ధరించినట్లయితే మీ జీవితంలో ఊహించని కష్టాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఫలితంగా మీ జీవితం భారంగా, దుర్భరంగా మారవచ్చు. అంతేకాదు మీరు అనవసరమైన చిక్కుల్లో ఇరుక్కునే అవకాశం కూడా ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ మెరిసే బంగారానికి దూరంగా ఉంటేనే మీ జీవితం సాఫీగా సాగుతుంది.
కుంభ రాశి
మీ రాశిని పాలించే గ్రహం న్యాయమూర్తి అయిన శని. శని గ్రహానికి మరియు సూర్యుడికి వైరం ఉంది. బంగారం సూర్యుడికి సంబంధించిన లోహం కాబట్టి కుంభ రాశి వారు దీనిని ధరిస్తే మీ వ్యాపారంలో ఊహించని నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు, మీ జీవితంలో అనేక రకాల కష్టాలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. ప్రశాంతమైన మనస్సు కూడా కరువైపోతుంది. కాబట్టి కుంభ రాశి వారు ఈ మెరిసే బంగారానికి దూరంగా ఉండటమే మీకు అన్ని విధాలా శ్రేయస్కరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications