Latest Updates
-
ఇంట్లోనే స్వచ్ఛమైన చాట్ మసాలా ..ఒక్కసారి చేసి పెట్టుకుంటే 8 నెలల పాటు నిల్వ! -
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటున్నారా? ఈ ముహూర్తాలు తెలిస్తే అదృష్టం మీదే! -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి అద్భుతమైన ధనయోగం..! - శనివారం, 18 ఏప్రిల్ 2026 -
ఎండల వేళ పెళ్లి వేడుకలు.. అతిథుల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. మీ ర్యాంక్ అంచనా వేసుకోవడం ఎలా? -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ క్రిస్పీ సొరకాయ దోశ ఉండాల్సిందే! -
ఎండల వేడికి తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో శరీరాన్ని చల్లబరచుకోండి! -
వైశాఖ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదేవతల ఆశీస్సులు! -
కమ్మని పెరుగు సేమియా..ఆహా ఏమి రుచి, తినరా మైమరచి..
దరిద్రాలు వెంటాడుతున్నాయా? ఈ మాల ధరిస్తే..ఏలినాటి శని కూడా తొలగిపోతుంది..జ్యోతిష్యశాస్త్రం చెబుతుందిదే
ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు మెడలో లేదా చేతికి కరుంగలి మాల ధరించడం మనం గమనించవచ్చు. సూపర్ స్టార్ రజినీకాంత్, కోలీవుడ్ హీరో ధనుష్, డైరక్టర్ లోకేష్ కనగరాజ్,తమిళ హీరో శివకార్తికేయన్ వంటి అనేక మంది ప్రముఖులు కరుంగలి మాల ఉండటం వీడియోలలో చూస్తున్నాం. అయితే ఈ కరుంగలి మాల అట్లాంటి ఇట్లాంది కాదు చాలా పవర్ ఫుల్ అని చాలామంది సోషల్ మీడియాలో కొందరు వీడియోలు కూడా పెడుతున్నారు.
వాస్తవానికి కరుంగలి మాల అనేక ఆధ్యాత్మిక, ఆరోగ్య, జ్యోతిష్యపరమైన ప్రయోజనాలను కలిగి ఉంది. హిందూమతంలో కరుంగలి మాలను చాలా మంది పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే అసలు కరుంగలి మాల అంటే ఏంటీది,దీని ప్రాముఖ్యత, ప్రయోజనాలు ఏంటో వివరంగా చూద్దాం.

కరుంగలి అంటే ఏంటి?
కరుంగులి అంటే నల్లటి కర్ర లేదా నల్లటి కలప అని అర్థం. ఈ మాల ఒక ప్రత్యేకమైన చెట్టు కలపతో తయారుచేయబడుతుంది. ఈ చెట్టు సాధారణంగా ఎండిన ప్రాంతాలలో పెరుగుతుంది. ఈ చెట్లు దక్షిణభారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ చెట్టు యొక్క కలప చాలా గట్టిగా,నల్లగా ఉంటుంది. దీనికి సహజమైన మెరుపు కూడా ఉంటుంది. అందుకే దీనిని విలువైనదిగా భావిస్తారు. పురాతన కాలం నుంచీ ఈ కలపను యజ్ఞ యాగాదులలో, దేవతా విగ్రహాల తయారీలో, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఈ కలపలో సహజంగానే సానుకూల శక్తిని ఆకర్షించే గుణం ఉందని నమ్మకం.
పెద్ద వయస్సు చెట్టునే
అంతేకాకుండా దాదాపు 70-100 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న ఈ చెట్ల కలపతో కరుంగలి మాల తయారుచేయడం మరో విశేషం. అందుకే ఇవి ఎక్కడ పడితే అక్కడ ఈజీగా లభించవు. ఇప్పుడు మార్కెట్లలో చాలామంది నకిలీ కరుంగలి మాలలను అమ్ముతున్నారు. అయితే ఒరిజినల్ కరుంగలి మాల చాలా ఖరీదు ఉంటుంది. చాలా మంది దీనిని ధరించడం వల్ల అదృష్టం, సంపద మనశ్శాంతి లభిస్తాయని విశ్వసిస్తారు.
ఈ రాయి తిరిగితే కోరిక నెరవేరినట్లే..! దర్శిస్తే అష్టదరిద్రాలన్నీ పోతాయ్ ..అరుదైన మరకత శివలింగం
జ్యోతిష్య ప్రయోజనాలు ఇవే
కరుంగలి చెట్టు కలపతో గింజల ఆకారంలో పూసలను తయారుచేసి వాటిని దారంతో గుచ్చి కరుంగలి మాల తయారుచేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కరుంగలి మాల అంగారక గ్రహానికి సంబంధించినది. ఈ మాలను ధరించడం వల్ల జాతకంలో అంగారక గ్రహం దుష్ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కరుంగలి మాలను ముఖ్యంగా రాహు, కేతు, శని గ్రహాల దుష్ప్రభావాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. రాహు-కేతు దోషాలు, శని మహాదశ, శని అంతర్దశ, అర్ధాష్టమ శని, ఏలినాటి శని వంటివి ఉన్నోళ్లు కరుంగళి మాల ధరించడం వల్ల ఆ గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గి జీవితంలో స్థిరత్వం, ప్రశాంతత లభిస్తాయని నమ్మకం. ఇది అడ్డంకులను తొలగించి, విజయానికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తారు. ఈ ప్రయోజనాలుంటాయనే చాలామంది సెలబ్రిటీలు ఈ మాలను ధరిస్తుంటారు.
ఆధ్యాత్మికంగా కూడా
ధ్యానం, జపం చేసేవారికి ఏకాగ్రతను పెంచడంలో కరుంగలి మాల సహాయపడుతుందని పండితులు చెబుతారు. మంత్రోచ్ఛారణ చేసేటప్పుడు వెలువడే శక్తిని ఈ మాల గ్రహించి నిల్వ ఉంచి ఆ శక్తి ప్రసారాన్ని పెంచుతుందని నమ్ముతారు. దీనివల్ల ఆధ్యాత్మిక సాధనలో పురోగతి లభిస్తుందని చెబుతారు. అంతేకాకుండా కరుంగళి కలపకు దుష్ట శక్తులు, భూత, ప్రేత పిశాచాలు, దృష్టి దోషాల ప్రభావాల నుండి రక్షణ కల్పించే శక్తి ఉందని నమ్ముతారు. ముఖ్యంగా చేతబడి వంటి వాటి ప్రభావాలను తగ్గించడంలో ఈ మాల సహాయపడుతుందని చెబుతారు.
ఆరోగ్య ప్రయోజనాలు
కరుంగళి మాలకు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నమ్ముతారు. ఇది ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమిని తగ్గిస్తుందని చెబుతారు. అంతేకాకుండా ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని,రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, ఎముకలను బలపరుస్తుందని కూడా నమ్ముతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











