Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ రాయి తిరిగితే కోరిక నెరవేరినట్లే..! దర్శిస్తే అష్టదరిద్రాలన్నీ పోతాయ్ ..అరుదైన మరకత శివలింగం
మనదేశంలో గుడులకు కొదవే లేదు. గల్లీకో గుడి ఉంది. అయితే కొన్ని గుళ్లు చాలా పాపులర్ అయ్యాయి. భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరడం వంటి కారణాలతో చాలా దేవాలయాలు ఫేమస్ అవుతుంటాయి. అలాంటివాటిలో ఒకటి హైదరాబాద్ దగ్గర్లో ఉంది. హైదరాబాద్ సమీపంలోని శంకరపల్లి దగ్గర్లోని చండిప్పలోని శ్రీ మరకత శివలింగ సోమేశ్వర స్వామి దేవాలయం చాలా చాలా ఫేమస్. దీనికి కారణం ఈ ఆలయంలో మరకత శివలింగం ప్రతిష్ఠించబడి ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది.
క్రీ.శ. 1076 నుండి 1126 మధ్యకాలంలో పశ్చిమ చాళుక్య రాజైన విక్రమాదిత్య పరిపాలించిన సమయంలో ఈ ఆలయం నిర్మించబడినట్లు సమాచారం. క్రీ.శ. 1101 అక్టోబర్ 23న సోమేశ్వర లింగం ప్రతిష్ఠించబడింది. కాలభైరవుడు ఒక దివ్య,మైన పాము ఈ ఆలయానికి క్షేత్రపాలకులని నమ్ముతారు. కాలక్రమేణా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. అయితే 2007లో నరేష్ కుమార్ అనే భక్తుడు దీనిని పునరుద్ధరించడానికి పూనుకున్నారని.. 2012లో ఆలయాన్ని తిరిగి నిర్మించారని సమాచారం.

ఈ ఆలయంలోని మరకత శివలింగం చాలా అరుదైనది, దీనిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. మరకతం అంటే బుద్ద గ్రహానికి చెందిన రంగు. పురాణాల ప్రకారం మరకత శివలింగాన్ని పూజించడం వలన కష్టాలు, పాపాలు తొలగిపోతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, విద్య అభివృద్ధి చెందుతుంది. రాజు లేదా పాలకులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ లింగానికి అభిషేకం చేయడం, గంధం రాయడం వలన ఔషధ గుణాలు ఉంటాయని నమ్ముతారు. శంకరపల్లి వెళ్ళినప్పుడు ఈ అరుదైన మరకత శివలింగాన్ని దర్శించుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. ఈ ఆలయాన్ని దర్శిస్తే అష్ఠదరిద్రాలన్నీ పోతాయని చెబుతారు.
ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఆలయంలో ఓ రాయి ఉంటుంది. దానిపై రెండు చేతుల బొటనవేళ్లు పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరే కోరిక అయితే ఆ రాయి దానంతట అదే కుడివైపుకు తిరుగుతుందని చాలామంది దానికి సంబంధించిన వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తమ కోరికలు ఇక్కడ కోరుకున్న తర్వాత నెరవేరాయని చాలామంది భక్తులు చెబుతే ఆ వీడియోల కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఈ పవర్ ఫుల్ ఆలయాన్ని వీలైతే మీరు ఓ సారి సందర్శిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications