Latest Updates
-
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు!
ఆరోగ్యానికే కాదు...అందానికి కూడా నెయ్యి దివ్వ ఔషధమే...
నెయ్యి - Ghee: పాల నుండి లభించే ఒక నూనె లాంటి కొవ్వు పదార్థం. దీనిని వంటలలో, పూజ కార్యక్రమాలలో, కొన్ని ఆహార పదార్థాలులో ఎక్కువగా వాడుతారు. వెన్న (Butter) ను మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తారు. చాలామందికి నేతిచుక్క కలవనిదే ముద్ద గొంతు దిగాడు . నెయ్యి శరీరానికి ఎన్నో పోషకాల్ని అందిస్తుంది. నెయ్యిని వంటకాలు తయారీలోగాని , నేరుగాగాని వాడవచ్చును.
సువాసనలు వెదజల్లే నెయ్యి ఆహారంలో రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి, సౌందర్యానికి కూడా ఉపయోగించుకోవచ్చు. సాధారణ వంటకాల్లో వినియోగించే నెయ్యి ఆరోగ్యానికి, అందానికి ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో వుండే పోషకాలు వివిధరకాల వ్యాధుల నుంచి పోరాడి ఆరోగ్యంగా వుంచడంతోపాటు చర్మసమస్యల్ని నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
ఆరోగ్యానికి అవసరమయ్యే గొప్పగుణాలున్ననెయ్యి
ఇతర ఆరోగ్యకారకాలతో పోల్చితే నెయ్యి దివ్యౌషధంలా పనిచేస్తుంది. అందుకే.. వైద్యులు కూడా తరుచూ ఆహారంలో నెయ్యిని తీసుకోవాల్సిందిగా సలహా ఇస్తారు. ఒక్క ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఎక్కువే, చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది .ఇది అన్ని రకాల చర్మ సమస్యలు డ్రై స్కిన్ నివారిస్తుంది. బ్యూటీ బెనిఫిట్స్ తోపాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కుగా ఉన్నాయి. అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది . హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది.
బరువు తగ్గి, స్లిమ్ బాడీ పొందడానికి పవర్ ఫుల్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్
నెయ్యిలో యాంటీయాక్సిడెంట్ తో నిండి ఉంటుంది. అందుకే చర్మ సంరక్షణలో ఎక్కువగా సహాయపడుతుంది. నెయ్యిలో కెరోటినాయిడ్స్ మరియు విటమిన్ ఎ మరియు ఇలు పుష్కలంగా ఉన్నాయి . ఈ యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది మరియు స్కిన్ సెల్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది . కాబట్టి ప్రతి రోజూ అందాన్ని మెరుగుపరుచుకోవడంలో దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించాలి. మరి బ్యూటీలో ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం...

డ్రై స్కిన్ నివారిస్తుంది:
నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఈ ఫ్యాటీ యాసిడ్స్ డ్రై స్కిన్ కు తగిన తేమను అందించి. చర్మం కాంతివంతంగా కనబడేలా చేస్తుంది . కొద్దిగా నెయ్యి చేతిలోకి తీసుకొని ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల డ్రై స్కిన్ నివారించబడుతుంది.

మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది:
చర్మానికి చాలా ఎఫెక్టివ్ గా మాయిశ్చరైజర్ ను అందిస్తుంది . చర్మం చాలా సాఫ్ట్ గా ఉండేట్టు చేసే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి . నెయ్యి మరియు కొద్దిగా నీరు తీసుకొని, రెండింటిని మిక్స్ చేసి, దీన్ని చర్మానికి అప్లై చేయాలి.తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

చర్మ కాంతిని పెంచుతుంది:
చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో నెయ్యి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఫ్యూరిఫై చేస్తుంది. నేచురల్ మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. దాంతో డల్ అండ్ డ్రై స్కిన్ బ్రైట్ గా మారుతుంది. కొద్దిగా పచ్చిపాలలో నెయ్యి మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఏజింగ్ స్కిన్ నివారిస్తుంది:
నెయ్యి ఒక యాంటీఏజింగ్ స్కిన్ సొల్యూషన్ . నెయ్యితో చర్మానికి తరచూ మసాజ్ చేయడం వల్ల, స్కిన్ సెల్స్ హెల్తీగా మరియు యుత్ ఫుల్ గా కనబడుతాయి.

డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది:
ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు కళ్ళ క్రింది బాగంలో నెయ్యిని అప్లై చేయడం వల్ల డార్క్ సెల్స్ నివారించబడుతుంది. మరియు నిర్జీవంగా ఉన్న మరియు డార్క్ సర్కిల్స్ ను మరియు కళ్ళ ఉబ్బును కూడా తగ్గిస్తుంది. కళ్ళ క్రింది బ్రైట్ గా చేసి రిఫ్రెష్ చేస్తుంది.

జుట్టు చిట్లకుండా చేస్తుంది:
డ్రై హెయిర్ వల్ల తరచూ జుట్టు చిట్లుతుంటుంది . ఈ సమస్యలకు నెయ్యి చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . నెయ్యి గోరువెచ్చగా కాచి, జుట్టు చివర్లకు అప్లై చేయాలి . 1గంట తర్వాత మన్నికైన షాంపుతో శుభ్రం చేసుకోవాలి.

కండీషనర్ గా:
చిక్కుబడిన మరియు డ్రై గా మారిన జుట్టుకు నెయ్యి అప్లై చేయడం వల్ల ఇది మంచి కండీషనర్ గా పనిచేస్తుంది . నెయ్యిని కొబ్బరి నూనెలో మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

కళ్ళ చుట్టూ మేకప్ తొలగించవచ్చు:
కళ్లకు వేసుకున్న మేకప్‌ని చాలా జాగ్రత్తగా తీసివేయాలి. అందుకు నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా దూది తీసుకొని నెయ్యిలో ముంచి కళ్ల చుట్టూ ఉండే చర్మాన్ని తుడవాలి.

ఫేస్ ప్యాక్ :
ప్రతిరోజూ స్నానానికి ముందు రెండు చుక్కల నెయ్యితో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ముఖం ఫేషియల్ చేసుకున్నట్టుగా మెరిసిపోతుంది. కొంచెం శెనగ పిండిలో కొన్ని చుక్కలు నెయ్యి, పాలు పోసి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడుక్కోవాలి.

లిప్ కేర్ :
పెదవులు బాగా పొడిబారినప్పుడు పడుకునే ముందు పెదాలకు నెయ్యి రాసుకోవడం వల్ల అవి చాలా మృదువుగా తయారవుతాయి.



Click it and Unblock the Notifications