For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒకే వారంలో మీ దంతాల వెనుక భాగంలో ఉన్నఅసహ్యకరమైన పసుపు మరకలను వదిలించుకోవడానికి అద్భుతమైన మార్గం!

|

కొందరిని చూస్తే వారి అందం అంతా వారి ముఖంలోని చిరునవ్వులో కనబడుతుంది. ఒక్కొక్కరిలో వారి నవ్వే వారి ముఖ అందానికి పెద్ద అసెట్ గా మారుతుంది. వారి మొత్తం అందాన్ని నవ్వుతోనే ఆకట్టుకునే విధంగా ఉంటారు. అయితే ఆ నవ్వు వెనుక అందమైన దంత వరుస, ఒక స్పార్క్ లా మెరిస్తుంటే ఆ అందం పదింతలు రెట్టింపు అవుతుంది. అలా ఉండాలంటే మన దంతాలు శుభ్రంగా మరియు తెల్లగా ఉండాలి. కానీ ఈ రోజు చాలా మందికి నోటిలో చాలా సమస్యలు ఉన్నాయి. అందానికి పెద్ద ఆస్తిలా ఉండే ఈ దంతాలు నోటి వాసన, పసుపు మరకలతో ఇబ్బందికరంగా ఉండటం గమనార్హం.

Try This Method To Remove Plaque From Teeth Within a Week,

నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు రోజూ పళ్ళు తోముకోవాలి. అయితే అందుకోసం మీ దంతాలను బ్రష్ చేయడం వల్ల మాత్రమే దంతాలలో పేరుకుపోయిన పసుపు మరకలు, గార వంటి సమస్యలను నిరోధించదు. చాలా మంది దంతవైద్యుడిని సందర్శించి పళ్ళపై ఉన్న గారన, పసుపు మరకలను తొలగించుకుంటారు.

కానీ దంతవైద్యుడి వద్దకు వెళ్లకుండా, ఎలాంటి ఖర్చులేకుండా మీ దంతాల వెనుక భాగంలో ఉన్న గార, పసుపు మరకలను వదిలించుకోవడానికి సులభమైన మార్గం ఉందని మీకు తెలుసా? ఈ వ్యాసంలో ఆ మార్గాలను తెలపడం జరిగింది.చూడండి ...

కావలసినవి:

కావలసినవి:

* బేకింగ్ సోడా - 2 టేబుల్ స్పూన్లు

* నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్

* టూత్‌పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

* ఆపిల్ సైడర్ వెనిగర్ - 1 టేబుల్ స్పూన్

* కొబ్బరి నూనె - 1 టేబుల్ స్పూన్

* అల్యూమినియం రేకు

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా యాంటీ బాక్టీరియల్ పదార్థం. ఇది నోటిలోని బ్యాక్టీరియాను చంపుతుంది. బేకింగ్ సోడా దంతాలను తెల్లగా చేస్తుంది మరియు నోటిలో పిహెచ్ స్థాయిలను సాధారణీకరిస్తుంది. బేకింగ్ సోడా అలెర్జీకి కారణమైతే ఆ పదార్థాన్ని నివారించండి. బేకింగ్ సోడా వాడటానికి ఇష్టపడని వారు, దానికి బదులుగా నిమ్మరసం వాడవచ్చు.

నిమ్మరసం

నిమ్మరసం

ఈ పద్ధతిలో ఉపయోగించే నిమ్మరసం బ్లీచింగ్ లాగా పనిచేస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది, ఇది నోటిలోని బ్యాక్టీరియాను చంపుతుంది మరియు మీ దంతాలను తెల్లగా మరియు దంతాలు పసుపురంగులో లేకుండా ఉంచుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్

ఈ పద్ధతి చాలా ఎఫెక్టివ్ గా ఉండటానికి మరొక కారణం ఆపిల్ సైడర్ వెనిగర్. దీనిలోని ఆమ్లత్వం దంతాలపై పసుపు మరకలను తొలగించడానికి సహాయపడుతుంది. కానీ దీనిని టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ వాడకూడదు.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె దంతాలకు అద్భుతమైన పదార్ధం. ఇది దంత క్షయం నివారించడానికి మరియు చిగుళ్ళను పోషించడానికి మరియు చిగుళ్ళ వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ఈ విధంగా కొబ్బరి నూనెను ఉపయోగించడమే కాదు, ఈ నూనెతో నోరు పుక్కిలించడం వల్ల చిగుళ్ళు మెత్తబడి, నోటి సమస్యలు నయం అవుతాయి. కొబ్బరి నూనెను ఉపయోగించకూడదనుకునే వారు ఆవ నూనెను వాడవచ్చు.

టూత్ పేస్ట్

టూత్ పేస్ట్

ఈ పద్ధతిలో టూత్‌పేస్ట్‌ను ఉపయోగించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. టూత్‌పేస్ట్ ప్లాట్‌ఫామ్ లాగా పనిచేస్తుంది. ఈ పద్ధతి కోసం ప్రధానంగా వైట్ టూత్‌పేస్ట్ ఉపయోగించండి.

విధానం:

విధానం:

* ఒక గిన్నెలో బేకింగ్ సోడా మరియు టూత్‌పేస్ట్ కలపండి.

* తరువాత దీన్ని నిమ్మరసం మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి.

* తర్వాత కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేయాలి.

* రెండు ముక్కలు అల్యూమినియం రేకులు తీసుకుని వాటిపై విడివిడిగా ఒక్కొక్క టీస్పూన్ వేసి రేకుమెత్తం సర్ది రాయండి. అప్పుడు ఒక అల్యూమినియం భాగాన్ని ఎగువ దంతాలపై, మరొకటి దిగువ దంతాలపై ఉంచాలి.

* 2 నిమిషాల తరువాత అల్యూమినియం రేకును తీసి నీటితో నోటిని పుక్కిలించండి.

* మిగిలిన మిశ్రమంతో మీ చేతివేళ్లతో లేదా బ్రష్ తో పళ్ళు తోముకుని నీటితో నోరు పుక్కిలించండి. ఈ మిశ్రమం సిద్ధమైన తర్వాత వెంటనే వాడాలి. దీన్ని మళ్లీ ఉపయోగించవద్దు.

గమనిక

గమనిక

ఈ పద్దతిని వారానికి రెండుసార్లు మాత్రమే వాడాలి. మీరు ఇలా చేస్తే మీ దంతాల వెనుక భాగంలో ఉన్న పసుపు మరకలు, గార మాయమవుతాయి మరియు దంతాలు తెల్లగా మరియు ఎలాంటి మరకలు లేకుండా నోరు శుభ్రంగా ఉంటుంది. మరియు ఇది సహజ పదార్ధాలతో తయారు చేయబడినందున ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

English summary

Try This Method To Remove Plaque From Teeth Within a Week

Do you know this single method remove plaque from teeth within a week? Read on...
Story first published: Monday, November 4, 2019, 13:16 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more