Latest Updates
-
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.!
బట్టతల రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు...

కొందరికి తల నుదురు బాగంలో వెంట్రుకలు రాలిపోయి, బట్టతల ఏర్పడుతుంది. రోజులు గడచేకొద్ది అది కాస్తా తల మొత్తం పాకి వెంట్రుకలన్నిటినీ హరించి వేస్తుంది. దీంతో ముఖం చూసేందుకు అందవిహీనంగా తయారవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే సరి.
1. మూడు టేబుల్ స్పూన్ పాలు తీసుకుని, అందులో ఒక చిన్న వెల్లుల్లి ముక్కను నానబెట్టి, దానిని బాగా నూరుకోవాలి. దీనిని వెంట్రుకలు ఊడిపోయిన భాగంలో పూయాలి. కొంత సమయం తర్వాత స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు మార్లు చేస్తే పోయిన వెంట్రుకలు, అందం తిరిగి మీ సొంతమవుతుంది.
2. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి.
3. సమతుల్య పౌష్ఠికాహారం తీసుకోవాలి.
4. జుట్టు దువ్వుకొనునప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి
5. జుట్టు రాలిపోవడానికి కారణమైన మందులను మార్చాలి.
6. ఫంగల్ ఇన్ ఫెక్షన్ల మూలంగా జుట్టు రాలుతున్న పక్షంలో జుట్టును పరిశుభ్రంగా వుంచుకోవడం. ఎండుగా, జిడ్డు లేకుండా వుంచుకోవడం వంటివి చూసుకోవాలి
7. టోపీలు ఇతరులవి పెట్టుకోకపోవడం ఇతరుల దువ్వెనను వాడక పోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. వంశపార పర్యంగా వచ్చే బట్టతలను కూడ కొన్ని సందర్భాలలో నివారించవచ్చు.
8. ప్యాంట్ జోబిలో పెట్టే దువ్వెనను కనీసం పదిహేను రోజుకొక్కసారైనా శుభ్రపరుచుకోవాలి.
9. ఎప్పుడు వెంట్రుకలను క్లీన్ గా పెట్టుకొవాలి. డాండ్రఫ్, పొక్కు, ఇచ్చింగ్ వంటి రాకుండా చూసుకోవాలి.
10. నెలలో రెండు సార్లైనా కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ గోరువెచ్చగా చేసి మాడుకు మర్థన చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.



Click it and Unblock the Notifications