Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గ్రీన్ ఫుడ్స్ తో మీ జుట్టు ఆరోగ్యంగా మిళమిళ మెరిపిస్తాయి...
మీ జుట్టు అందంగా...మంచి షైనింగ్ తో సాప్ట్ గా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అయితే ఇక్కడ కొన్ని రకాల జ్యూసులను మీకు పరిచయం చేస్తున్నాము. ఇవి మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తాయి. ఈ జ్యూసులను మీరు ఇంట్లోనే చాలా చౌకగా తయారుచేసుకోవచ్చు .
అయితే ఈ క్రింది తెలిపి జ్యూసులను కేవలం గ్రీన్ కలర్ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ తో తయారుచేసుకోవాలి . ఈ గ్రీన్ కలర్ ఫుడ్స్ లో ఉండే విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ జుట్టు మొదళ్ళకు కావల్సినంత ఎనర్జీని అందిస్తాయి. దాంతో జుట్టుకు నేచురల్ షైన్ ను పొందవచ్చు.
తలలో మొటిమలను నివారించుకోవడానికి సులభ చిట్కాలు
ఈ గ్రీన్ జ్యూసులను జుట్టుకు ఉపయోగించడం వల్ల కేవలం జుట్టుకు షైనింగ్ ను అందివ్వడం మాత్రమే కాదు, ఇది ఇతర జుట్టు సమస్యలైన చుండ్రు, హెయిర్ ఫాల్ తల దురద, తలలో పేలు మరియు జుట్టు చిట్లడాన్ని కూడా నివారిస్తుంది. అంతే కాదు, ఈ గ్రీన్ జ్యూస్ లో ఉండే మినిరల్స్ జుట్టును సాఫ్ట్ గా మార్చుతుంది. మరికెందుకు ఆలస్యం...మీకు అందుబాటులో ఉండే గ్రీన్ జ్యూసులను ఎంపిక చేసుకొని మీ అందమైన జుట్టును కాపాడుకోండి...

పుదీనా జ్యూస్:
ఒక మగ్గు వేడినీటిలో 100గ్రాముల పుదీనా ఆకులు వేసి 15నిముషాలు ఉడికించాలి. తర్వాత ఈ నీటిని వడగట్టుకొని, ఆ నీటితో షాంపు తర్వత తలస్నానం చేయడం వల్ల కేశాలకు నేచురల్ షైనింగ్ వస్తుంది. ఇలా కొన్ని వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

క్యాబేజ్ జ్యూస్:
కొంత క్యాబేజ్ తీసుకొని, మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కు అరకప్పు రోజ్ వాటర్ మిక్స్ చేసి తలకు మాస్క్ లా వేసుకోవాలి. ఇలా 15 రోజుల పాటు వేసుకోవడం వల్ల మీ జుట్టుకు నేచురల్ షైనింగ్ వస్తుంది.

ఆకుకూరల జ్యూస్:
ఆకుకూరలను మిక్సీలో వేసి పేస్ట్ లా చేయాలి . ఈ పేస్ట్ కు కొద్దిగా పాలు జోడించి, ఈ పేస్ట్ ను జుట్టుకు మాస్క్ లా వేసుకోవాలి లేదా. మిక్సీలో జ్యూస్ లా తయారుచేసుకొని తలకు పట్టించాలి . ఇలా చేయడం వల్ల మీ జుట్టు నేచురల్ గానే మెరుస్తుంటుంది.

బ్రొకోలీ జ్యూస్:
జుట్టు సంరక్షణకోసం ఉపయోగించే వెజిటేబుల్ జ్యూసులలో బ్రొకోలీ జ్యూస్ ఒకటి. బ్రొకోలీని మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా పాలు వేసి తలకు మాస్క్ లా వేసుకోవచ్చు. లేదా జ్యూస్ చేసి తలకు పట్టించి 20 నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఈ గ్రీన్ జ్యూస్ మంచి వాసన కూడా కలిగి ఉంటుంది.

సెలరీ జ్యూస్:
ఈ గ్రీన్ జ్యూస్ ను మాస్క్ లా వేసుకోవచ్చు. ఈ మాస్క్ ను వారంలో రెండు సార్లు వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక కప్పు సెలరీ జ్యూస్ లో అరగ్లాసు పాలు మిక్స్ చేసి, తలకు పట్టించి మసాజ్ చేసి 15 నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

కీరదోసకాయ జ్యూస్:
కీరదోసకాయ జ్యూస్ జుట్టుకు చల్లదాన్ని అందిస్తుంది. అలాగే జుట్టు మొదళ్ల నుండి జుట్టు పొడవునా మంచి షైనింగ్ ను అందిస్తుంది. ఈ హేర్బల్ హెయిర్ మాస్క్ వల్ల తలలో జిడ్డు తొలగుతుంది.

ఆస్పరాగస్:
ఆస్పరాగస్ గ్రీన్ వెజిటేబుల్స్ లో ఒకటి . ఇది జుట్టు సంరక్షణకు బాగా సహాయపడుతుంది . ఆస్పరాగస్ జ్యూస్ ను వారంలో రెండు సార్లు తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది

బీన్ జ్యూస్ :
అధిక ప్రోటీనులున్న వెజిటేరియన్ ఫుడ్ బీన్స్ . అందుకే ఇది జుట్టు పెరుగుదలకు అవసరం అయ్యే ఫుడ్ లిస్ట్ లో తప్పనిసరిగా ఉంటుంది. బీన్స్ ను పేస్ట్ లా చేసి అందులో కొబ్బరినూనె మిక్స్ చేసి తలకు పట్టిచి, అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు మంచి షైనింగ్ వస్తుంది. ఈ మాస్క్ ను నెలకొకసారి చేస్తే మంచిది.

గ్రీన్ ఆపిల్ జ్యూస్:
గ్రీన్ ఆపిల్ జ్యూస్ మీ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది . స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది . ఆపిల్ మాస్క్ వేసుకొన్న 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి.

కివీ ఫ్రూట్ :
నిర్జీవమైన జుట్టును నివారించుకోవడానికి గ్రీన్ జ్యూస్ ను ట్రై చేయవచ్చు అంతే కాదు, ఈ గ్రీన్ జ్యూస్ వల్ల కేశాలు మంచి షైనింగ్ తో మెరుస్తుంటాయి.



Click it and Unblock the Notifications