Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Eid Special : పండుగ వేళ మీ చర్మ సౌందర్యం రెట్టింపు కావాలంటే... ఈ చిట్కాలను ఫాలో అవ్వండి...
పండుగ సమయాల్లో మరింత అందంగా కనిపించాలంటే ఈ చిట్కాలు పాటించండి.
ప్రస్తుతం వర్షకాలం కాబట్టి వాతావరణం అంతా చల్లగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మన చర్మం త్వరగా పొడిబారిపోతుంది.

అయితే అలా జరగకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ముఖ్యంగా పండుగ లేదా ఈద్ వంటి సమయాల్లో మీ చర్మ సౌందర్యం మరింత రెట్టింపు కావాలని, నలుగురిలో తామే ప్రత్యేకంగా కనిపించాలని ప్రతి ఒక్క మహిళా కోరుకుంటుంది.

అందుకోసం పండుగకు ముందే ఎన్నో సన్నాహాలు చేస్తుంటారు. ఈ సందర్భంగా ఈద్ సమయంలో చాలా స్టైలిష్ గా కనిపించేందుకు అమ్మాయిలు తమ డ్రస్సుల నుండి మేకప్ వరకు చాలా శ్రద్ధ చూపుతారు. ఈ సందర్భంగా ఈద్ రోజున అమ్మాయిలు ఎలాంటి మేకప్ వేయడానికి ఇష్టపడతారు.. మన చర్మ ఆరోగ్యం దెబ్బ తినకుండా సహజమైన పద్ధతిలో మరింత సౌందర్యం పెంచుకోవడమెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
మీరు ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా? అయితే, ఈ టీలు తరచూ తాగండి ...!

లైట్ మేకప్ లుక్..
ఈరోజుల్లో చాలా మంది లైట్ మేకప్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మీకు కూడా లైట్ మేకప్ నచ్చితే.. మీరు ఈద్ రోజున దీన్ని ఫాలో అవ్వొచ్చు. దీని కోసం మీ ముఖాన్ని ముందుగానే శుభ్రం చేసుకోండి. తర్వాత మీ కళ్లపై లైట్ గా మేకప్ వేసి.. కంటి కింద పడే నీడ మీద కాస్త మేకప్ చేసుకోండి. ఆ తర్వాత బుగ్గలపై లైట్ బ్రౌన్ కలర్ బ్రష్ ను వాడండి. ఆ తర్వాత మీకు నచ్చిన కలర్ లిప్ స్టిక్ ను అప్లై చేయండి చాలు.

ఆకర్షణ రూపం కోసం..
పండుగ వంటి సమయాల్లో మీరు అందరి కంటే అందంగా.. నలుగురిలో మీరే ఆకర్షణగా నిలవాలంటే.. మీరు కంటి కింద బంగారం కలర్లో ఉండే లైనర్ ను అప్లై చేయండి. ఆ తర్వాత ఐలైనర్ వాడండి. ఇది మీ కళ్లకు అందమైన రూపాన్ని ఇస్తుంది. ఆ తర్వాత లైట్ పింక్ కలర్ బ్లష్ చేయండి. అనంతరం మీ చర్మంపై మీకు నచ్చిన రంగులో మేకప్ వేసుకోండి. తర్వాత ఏదైనా లిప్ స్టిక్ వేసుకుంటే మీరు కొంచెం కొత్తగా కనిపిస్తారు.

పింక్ మేకప్..
చాలా మంది మహిళలు ఈద్ సమయంలో పింక్ లిప్ స్టిక్ తో మేకప్ చేస్తుంటారు. కాబట్టి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ముందుగా మీరు బేస్ మేకప్ చేసుకుని.. ఆ తర్వాత పింక్ మేకప్ కోసం ప్రయత్నించండి. ముఖ్యంగా మీ కళ్లపై పింక్ ఐషాడో వేయండి. ఆ తర్వాత పింక్ లిప్ స్టిక్ ను అప్లై చేయడం ద్వారా మీ మేకప్ ను పూర్తి చేయాలి. ఈరోజుల్లో చాలా మంది మహిళలు పింక్ మేకప్ ను బాగా ఇష్టపడుతున్నారు. ప్రతి ఈద్ సమయంలో పింక్ మేకప్ కచ్చితంగా ఉంటుంది.

స్మోకీ లుక్..
కొందరు మహిళలు మేకప్ అంటే పడి చచ్చిపోతారు. అందుకే ఎక్కువ మేకప్ వేసుకోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే అలాంటి మహిళలంతా స్మోకీ ఐ మేకప్ చేసుకోవచ్చు. స్మోకీ లుక్ కోసం, మొదట సరైన ఫౌండేషన్ మరియు కన్సీలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా మీ ఫేస్ పై బ్రౌన్ మరియు డార్క్ కలర్ ఐ షాడోను అప్లై చేయాలి. స్మోకీ లుక్ కోసం కాబట్టి డార్క్ కలర్ ఐ షాడోనే వాడాలి. ఆ తర్వాత లైట్ గా లిప్ స్టిక్ వాడండి. ఒక వేళ మీకు డార్క్ లిప్ స్టిక్ వేసుకోవాలనిపిస్తే అది కూడా అప్లై చేయొచ్చు.

కలబంద, పసుపు, రోజ్ వాటర్..
కెమికల్స్ వేసుకోకుండా సహజంగా మేకప్ చేసుకోవాలని భావించే వారు కలబంద, పసుపు, రోజ్ వాటర్ ను వాడొచ్చు. దీని వల్ల మీ చర్మం మరింత అందంగా, ఈద్ సమయంలో యవ్వనంగా, చాలా కొత్తగా కనిపిస్తారు. ముందుగా కలబంద, రోజ్ వాటర్, పసుపు తీసుకోవాలి. ఒక గిన్నెలో టీ స్పూన్ కలబంద గుజ్జు, రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్, ఒక టీ స్పూన్ పసుపు పొడి వేసి బాగా కలపాలి. దాన్ని ఒక ఫేస్ ప్యాక్ మాదిరిగా తయారు చేసుకోవాలి. ఇవి మీ చర్మానికి కావాల్సిన పోషణాలను కూడా అందించి.. మిమ్మల్ని కొత్తగా కనిపించేలా చేస్తుంది.



Click it and Unblock the Notifications