Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కళ్లను రోజుకు ఎన్ని సార్లు శుభ్రం చేస్తున్నారు..?

ఎవరి ఆరోగ్యానికి వారే బాధ్యులు, అవయవాల్లో అత్యంత కీలకమైన నేత్రాలను ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచుకోవల్సిన బాధ్యత వ్యక్తిగతంగా ప్రతిఒక్కరిపై ఉంది.
- కళ్లకు కావల్సిన నిద్రతో పాటు విశ్రాంతిని తప్పనిసరిగా కేటాయించాలి. వివిధ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు కంట్లో నలుసు పడితే.. చేత్తో నలపటం, రుద్దటం వంటి పనులు ప్రమాదకరం. ఈ చర్యల వల్ల చేతికి ఉన్న బ్యాక్టీరియా, మట్టి ఇతర ధూళికణాలు కంట్లో చేరి అలెర్జీ, ఇన్‌ఫెక్షన్ తదితర రుగ్మతలను వ్యాపింప చేస్తాయి.
- కంట్లో నలుసు లేదా ఇతర ధూళి కణాలు చేరితే, ముందుగా చేతులను శుభ్రం చేసుకుని మెత్తని కాటన్ వస్త్రంతో కళ్లను శుభ్రం చేయండి.
- సాధ్యమైనంత వరకు కళ్లను రోజుకు రెండు లేక మూడు సార్లు మాత్రమే నీటితో శుద్ధి చేసుకోవాలి. కళ్ల సంక్షణకు వినియోగించే ఉత్పత్తుల మన్నికైనవిగా ఉండాలి.
- ముఖ్యంగా ఆడవారు కళ్లకు కాటుక పెట్టుకునే తమ చేతి వేళ్లను శుభ్రం చేసుకోవాలి. ఈ విషయంలో ఆశ్రద్ధ చేయ్యటం వల్ల కళ్లలో చెడు బ్యాక్టిరీయ వ్వాప్తి చెంది కంటి సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
- కళ్లకు షేప్ రావడం కోసం ఐ లైనర్‌ను పలువురు మహిళలు ఉపయోగిస్తుంటారు. ఈ లైనర్‌ను ఉపయోగించే సందర్భంలో కళ్లకు హాని కలగకుండా చూసుకోవాలి.
- షాంపూ లేదా కుంకుడి కాయలతో తల స్నాం చేసే వారు మిశ్రమాన్ని తలకు రుద్దుకునే సందర్భంలో కళ్లు మూసుకోవటం మంచిది.
- టీవీని దగ్గరగా చూడటం, కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు కూర్చోవటం వంటి అంశాలు కళ్లకు హాని తలపెడతాయి. ఇలా కూర్చోవల్సి వచ్చిన వాళ్లు నేత్ర వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు కళ్లద్దాలను ధరించటం మంచింది.
- కళ్లకు ఆరోగ్యవంతమైన పోషకాలనందించే పాలకూరలతో పాటు క్యారెట్లను అధిక మోతాదులో తీసుకోవాలి.



Click it and Unblock the Notifications