Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
అందం... యవ్వనం 8 రకాల పండ్లతో మీ సొంతం...
చర్మం సౌందర్యం ఇంట్లో మనం ప్రతి నిత్యం వినియోగించే వస్తువులతోనే పెంపొందించుకోవచ్చని మీకు తెలుసా..?నెలకో లేదా రెండు నెలలకో ఒక సారి లేదా సంవత్సరానికొక సారో అందం కోసం వేలల్లో ఖర్చు చేయాల్సిన పనిలేకుండానే మిమ్మల్ని అందంగా... యవ్వనంగా ఉంచే వస్తువులు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యమే. అందుకు ముఖ్యంగా ఉపయోగించాల్సినవి పండ్లు. పండ్లు ఆరోగ్యానికి మాత్రమే కాదు సౌందర్యాన్ని రెంటింపు చేయడంలోనూ మెండుగా ఉపయోగపడుతాయి. వీటిలో సహజసిద్ధమైన విటమిన్లు, మినర్ల్స్, ఫైటో కెమికల్స్ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యంతో పాటు.. అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది.
ప్రకృతి పరంగా లభించే పండ్లును తీసుకోవడంతో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. శరీరానికి కావలసిన పోషకపదార్థాలు పండ్లు, కూరగాయల్లో ఉంటాయనడంలో సందేహం లేదు. అనారోగ్యంగా ఉండేవారికి, ఆరోగ్యంగా ఉండే వారికి పండ్లు టానిక్‌లా ఉపయోగపడతాయి. మనిషి ఆయుష్యును పెంచుతాయి. ఆరోగ్యానికి ఎంతగా పండ్లు ఉపయోగపడుతాయో.. అందాన్ని రెట్టింపు చేయడంలో కూడా అంతగా పనిచేస్తాయి.. చర్మాన్నికి మెరుపునందంచి, కాంతివంతగా, ఫ్రెష్ గా ఉంచి...అందాన్ని రెట్టింపు చేసే కొన్ని రకాల పండ్లు మీకోసం ...

ఆపిల్స్
ఆపిల్స్: పండ్లు అనగానే ఎన్నో రకాల పండ్లు గుర్తొస్తాయి. అయితే వాటిలో ఆరోగ్యానికి.. సౌందర్యానికి బాగా ఉపయోగపడే పండు ఆపిల్ పండు. ఈ పండు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతే కాదు మొటిమలు, మచ్చలు, చారలున్న ముఖంతో పోరాడతుంది. ముఖాన్ని కానీ శరీరాన్ని కానీ శుభ్ర పరచే ముందు ఆపిల్ జ్యూస్ ను గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలి.

అవొకాడో
అవొకాడో : అవొకాడో చాలా మందికి తెలియదు. మన నిత్యం తినేటటువంటి పండ్లలో ఇది కూడా ఒక రకమైన పండే. పండు మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఇది ఒక దివ్వౌషదం. ముఖ్యంగా పొడిబారిన చర్మం కలవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇక అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అందుకు చేయాల్సిందల్లా.... అవొకాడో పండును సగ భాగానికి కట్ చేసి మెత్తని పేస్ట్ లా చేసి ముఖానికి అప్లైచేసి పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బనానా(అరటి పండు)
బనానా(అరటి పండు): అరటి పండు ఆరోగ్యాన్ని, జీర్ణశక్తిని పెంచడమే కాదు. చర్మాన్ని శుభ్రపరచడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. పొడి చర్మానికి మాయిశ్చరైజర్ గా ఉపయోగపడటమే కాకుండా చర్మాన్ని టైట్ గా ఉంచుతుంది. బాగా పండిని అరటి పండును, చేత్తో మెత్తగా గుజ్జులా చేసి ఫేషియల్ మాస్క్ వేసుకోవాలి. పదినిముషాల తర్వాత శుభ్రం చేసి చూడండి మార్పు మీకే తెలుస్తుంది. చర్మ బిగుతుగా అవ్వడంతో పాటు ముఖం కాంతివంతంగా మారుతుంది.

పాపాయ(బొప్పాయి)
పాపాయ(బొప్పాయి): పాపాయ అద్భుతమైన చర్మ క్లెన్సర్ గానే చెప్పవచ్చు. ఎందుకంటే పాపాయలో పపిన్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల ఇది చర్మ సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆయిల్ స్కిన్ కలవారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖంలో ఉన్నజిడ్డును తొలగిస్తుంది. అంతే కాదు చర్మ కాంతిని పెంచి చర్మ ఛాయను పెంచుతుంది. నల్లటి వలయాల్ను తొలగిస్తుంది. చారలు, గీతలు తొలగిస్తుంది. పాపాయను చిన్న ముక్కలుగా చేసి, గుజ్జులా తయారు చేసుకొని ముఖానికి, కళ్ళ క్రింది మాస్క్ వేసి శుభ్రపరచుకోవాలి.

పీచెస్
పీచెస్: ఇవి చూడటానికి ఆపిల్స్ లానే ఉంటాయి. కానీ ఆపిల్ కాదు. పీచెస్ ఆరోగ్యానికి మాత్రమే కాదు గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది. ఇది చర్మాన్ని శుభ్రపరిచి, బిగుతు చేయడానికి మాత్రమే కాదు, ముఖ కండరాలను బిగుతుగా ఉండేలా చేస్తుంది. అందుకు పీచెస్ పండ్ల మీద ఉన్న తొక్కను తొలగించి లోపల ఉన్న పదార్థంతో ముఖాన్ని బాగా మర్దన చేసుకోవాలి. దాంతో వెంటనే మీరు ఫ్రెష్ గా ఫీల్ అవ్వడమే కాకుండా చర్మం టైట్ గా అనిపిస్తుంది.

నిమ్మకాయ
నిమ్మకాయ: నిమ్మకాయ ఆరోగ్యానికి దివ్వౌషదం అంతే కాదు. చర్మాన్ని శుభ్రపరచుటలో అత్యధిక సామర్థం కలిగిన గుణాలు కలిగి ఉన్నది. చర్మాన్ని శుభ్ర పరిచి ఫ్రెష్ గా ఉంచుతుంది. నిమ్మకాయను సౌందర్యాన్ని పెంచే ఖచ్చితమైన నేచురల్ బ్లీచ్ అని చెప్పవచ్చు. నిమ్మరసం ముఖానికి పట్టించడం ద్వారా ఎండకు కమిలిన చర్మాన్ని బాగు చేసి, ముఖంలో ఉన్న మొటిమలు మచ్చలను తొలగిస్తుంది.

పైనాపిల్
పైనాపిల్: సువాననందించే పైనాపిల్ చర్మ సంరక్షణలో బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని శుభ్రపచడమే కాకుండా నిర్జీవంగా మారిన, పొడి బారిన చర్మాన్ని తేజోవంతం చేసి, చర్మాన్ని నునుపు చేస్తుంది. పైనాపిల్ ముక్కలను ముఖం, శరీరం మీద కొద్దిసేపు రుద్ది స్నానం చేసినట్లైతే మీరు ఫ్రెష్ గా ఫీలవుతారు.

గుమ్మడి కాయ
గుమ్మడి కాయ: గుమ్మడి కాయ పచ్చిగా తినే పండు కాకపోయి అత్యధిక పోషక విలువలున్నకూరగాయగా చెప్పవచ్చు. ఇది చర్మానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది వయస్సు పైబడనీయకుండా యవ్వనంగా ఉండేలా చేస్తుంది. చర్మ రంధ్రాలను తెరచుకొనేలా చేసి శుభ్రపరుస్తుంది.



Click it and Unblock the Notifications