Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
మెరిసే చర్మ సౌందర్యానికి ఫ్రూట్ జ్యూసులు...!

కనుక రోజూ ఓ కప్పు యాపిల్ జ్యూస్ కనుక తాగగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం. చర్మ సౌందర్యం వస్తుందని చెపుతున్నారు. అలాగే, క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి మహా మంచిదంటున్నారు. ఇది ముఖానికి తేజస్సును ఇవ్వడమే కాకుండా, కళ్ళకు ఏంతో మంచిదని చెపుతున్నారు. అసిడిటీని సైతం తగ్గిస్తుందట. క్యారెట్‌లో విటమిన్ ఏ, సీలు మాత్రమే కాకుండా మరెన్నో పోషక విలువలు ఉంటాయని వారు చెపుతున్నారు.
ఇకపోతే.. బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ సైతం చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. పైగా ఇది లివర్‌కు మంచిది. కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రక్తంలో ఏమైనా మలినాలు ఉంటె పోతాయాట. అన్నిటికంటే ముఖ్యంగా ఎర్ర రక్త కణాల సమాఖ్య పెంచుతుందంటున్నారు. అలాగే, కడిగిన టొమాటోలు నాలుగు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ముఖానికి మంచి గ్లో వస్తుందని చెపుతున్నారు.
స్కిన్ క్రీములు కొనేందుకు భారీగా వెచ్చిస్తున్నారా.. అయితే ఇకపై ఆ డబ్బును ఆదా చేయండి. ఎలాగంటారా.. టమోటా జ్యూస్ తీసుకోవడం ద్వారానే. అసలు విషయమేమిటంటే... నిత్యయవ్వనులుగా కనిపించాలంటే టమోటా జ్యూస్, సూప్ వంటివి తీసుకుంటే చాలునని తాజా అధ్యయనంలో తేలింది.
వయసు మీదపడటంతో ఏర్పడే ముడతలకు చెక్ పెట్టాలంటే టమోటా గుజ్జుతో ప్యాక్ వేసుకుంటే సరిపోతుందని లండన్‌లోని రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసన్ కళాశాల నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఎరుపాటి టమోటాల గుజ్జును ముఖానికి ప్యాక్ వేసుకోవడమే గాకుండా.. క్రమం తప్పకుండా టమోటా జ్యూస్ తాగడం, వంటల్లో అధికంగా టమోటాలను చేర్చడంతో మహిళల అందం మరింత పెరుగుతుందని ప్రొఫెసర్ బిర్చ్-మచిన్ తెలిపారు.
టమోటోస్ తీసుకునే మహిళల్లో చర్మ రక్షణ పెరిగిందని తేలింది. ఐదు టేబుల్ స్పూన్లు (55గ్రాములు) టమోటా గుజ్జుకు పది గ్రాముల ఆలివ్ ఆయిల్‌ను ప్రతీరోజూ పన్నెండు వారాల పాటు వాడిన 20 మంది మహిళల్లో సాధారణ మహిళల కంటే చర్మ సౌందర్యం 33 శాతం మరింత పెరిగిందని పరిశోధనలో వెల్లడైంది.
21-47 వయసు గల మహిళలపై ఈ పరిశోధన చేయబడింది. ఈ పరిశోధనలో టమోటాలు తీసుకునే వారిలో సూర్యరశ్మి నుంచి చర్మాన్ని సంరక్షించగల సామర్థ్యం అధికంగా కలదని తెలిసింది.



Click it and Unblock the Notifications