Latest Updates
-
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్! -
కుజ-గురు కలయికతో ద్విద్వాదశ యోగం..ఈ 4 రాశులకు అడుగడుగునా అదృష్టమే! -
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు! -
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? -
కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్.. -
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.! -
పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే!
సెలబ్రిటీలా మెరవాలంటే పండ్ల రసాల రహస్యం....!

పండ్లలో చాలా వాటికి మంచి పోషకాలుంటాయి. చర్మం మెరవాలంటే పండ్ల రసాలు మంచివే. ఆరోగ్యంగా వుంచటమే కాక త్వరగా శరీర చర్మంపై ఫలితాలు చూపుతాయి. అంతేకాదు, తాజా పండ్ల రసాలను శరీరం అతి త్వరగా పీల్చేసుకుని జీర్ణ చేసుకుంటుంది. రోజువారీ జీవితంలోఎవరెంత బిజీ షెడ్యూలు కలిగి వున్నా తప్పకుండా ఒక్క గ్లాసెడు పండ్ల రసం శరీరానికి మేలు చేస్తుందనేది గ్రహించి తాగుతూండాలి.
చర్మం కొరకు మంచి పోషకాలు కల తాజా పండ్ల రసాలు చెప్పాలంటే, ఆరెంజ్ పండ్ల రసం, యాపిల్ రసం, నిమ్మరసం, పుచ్చకాయ రసం తాగాలి. అయితే, బొప్పాయ రసం కూడా బాగా పని చేస్తుంది. కూరగాయలైన బచ్చలి కూర, తోటకూర, క్యాబేజి వంటి రసాలు కూడా అద్భుత ఆరోగ్యాన్ని, చర్మకాంతులను తెచ్చిపెడతాయి.
ఆరెంజ్ లో ఎక్కువ విటమిన్ సి సంవృద్దిగా లభిస్తుంది. దాంతో ముఖం మీద ఉండే నల్లమచ్చల్ని, ముడతల్ని పోగొట్టే దివ్వ వౌషదంగా పనిచేస్తుంది. ఆపిల్ తినడం, లేదా జ్యూస్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుతుంది. హై ప్రొటీన్స్ ఉన్న యాపిల్ పేస్ట్ ను ఫేస్ ఫ్యాక్ గా ను వేసుకోవచ్చు. దాంతో చర్మ సంబంధిత వ్యాధులను దరిచేరనియ్యకుండా చేయడమే కాక, చర్మం మెరిసేలా చేస్తుంది.
అరటి పండులో విటమిన్స్, మినిరల్స్, ఫైబర్స్ మరియు కార్బోహైడ్రేట్స్, పొటాషయం మెండుగా ఉంటాయి. చర్మం కాంతివంగా తయారు చేస్తుంది. బాదం ఇందులో ఎక్కువగా విటమిన్ ‘ఇ’ ఉంటుంది. ఇది చర్మసంరక్షణకు బాగా దోహదం చేస్తుంది. పైనాపిల్ జ్యూస్ తీసుకోవడం వల్ల అందుల విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఎ మరియు విటమిన్ బి కూడా కలిగి ఉంటుంది. ఇది కూడా చర్మం రక్షణకు బాగా పనిచేస్తుంది. మరి మీకు ఏది అందుబాటులో వుంటే దానిని తాగి అందం, ఆరోగ్యం సంరక్షించుకోండి.



Click it and Unblock the Notifications