Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వేసవిలో చర్మ సంరక్షణకు తాజా పండ్లు...పళ్ళరసాలు...

పళ్ళును తీసుకోవడం వల్ల చర్మం బాగా శుభ్రపరచి తాజాగా ఉంచగలుగుతాయి. చర్మం సంరక్షణకు పళ్ళను వినియోగించే ముందు కొన్ని సూచనలు గుర్తుపెట్టుకోవాలి.
1. ముందుగా ముఖాన్ని శుభ్రంగా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
2. పొడి చర్మం అయితే ముఖానికి ఏదైనా లైట్ క్రీమ్ ని పలుచగా రాయాలి. తర్వాత మెత్తని బట్టని తీసుకుని దానిని పళ్ళరసంలో ముంచి ముఖంపై కప్పుకుని అరగంట పాటు అలాగే ఉంచుకోండి. బట్టకు కళ్ళవద్ద రంధ్రాలు ఉండాలి ఇలా చేయటం వల్ల పళ్ల రసాల వల్ల కళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా తయారు చేసుకునే పళ్ళ మాస్క్ లు కోడిగుడ్డు, ఓట్‌మీల్ పిండిలతో కూడా తయారు చేసుకోవచ్చు.
3. జిడ్డు చర్మం ఉన్నవారు పళ్ళలో గుడ్డు లోని తెల్లసొనని కూడా కలుపుకోవచ్చు. ఇలా తయారైన మిశ్రమం చిక్కగా ఉంటే దీనిని మొహానికి పట్టించేందుకు బట్టని ఉపయోగించకుండా నేరుగా పూయవచ్చు.
4. పొడిచర్మానికి: అప్రికాట్స్, ద్రాక్ష, అరటి, ఖర్బూజా, రేగుపళ్ళు మొదలైనవి వాడొచ్చు. కొంత కేరట్ రసాన్ని కూడా కలపొచ్చు. ఇది పొడి చర్మానికి అద్బుతంగా పని చేస్తుంది.
5. జిడ్డు చర్మానికి: క్యాబేజి, టమాట. దోసకాయ, పుచ్చకాయ, కమలా పళ్ళు, ఇవి జిడ్డు, సాధారణ చర్మాలకుకూడా ఉపయుక్తంగా ఉంటాయి. మొహానికి పళ్ళ మాస్కులు వేసుకుంటున్నపుడు మెడని మర్చిపోవద్దు. మొహానికి తీసుకుంటున్న శ్రద్ధని మెడ విషయంలోనూ తప్పనిసరిగా తీసుకోవాలి.



Click it and Unblock the Notifications