Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
నల్లబడ్డ చర్మం మామూలు స్థితికి రావాలంటే...

కొన్ని చిట్కాలు.
1. మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. తాజా పండ్ల రసాలు, మజ్జిగ ఎక్కువగా తాగాలి.
2. నల్ల ద్రాక్ష, పుచ్చకాయ, దానిమ్మ పండ్లు ఎక్కువగా తినాలి.
3. బయటకు వెళ్ళడానికి 30 నిమిషాల ముందే సన్‌క్రీమ్ లోషన్ ముఖానికి రాసుకోవాలి.
4. నల్ల ద్రాక్ష గుజ్జుకి కొంచెం తేనె కలిపి ప్రతి రోజూ స్నానానికి 20 నిమిషాల ముందు ముఖానికి రాసుకుని ఆ తరువాత చన్నీళ్ళతో స్నానం చేయాలి.
5. కొంచెం క్యారెట్, కొంచెం క్యాబేజీ, కొంచెం ఓట్స్ కలిపి మిక్సర్‌లో వేసి పేస్ట్‌గా తయారు చేసి, దానిలో సగం చెంచా పాల మీగడ, సగం చెంచా తేనె, 3 చెంచాల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కొంచెం గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై నల్లమచ్చలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి.
6. పిగ్మెంటేషన్ సమస్య ఉన్న వాళ్ళు ఎండలో బయటకు వెళ్లి వస్తే, ముఖం కడుక్కొని కీరాను గుండ్రటి ముక్కలుగా కోసి ముఖం పై 20 నిమిషాల పాటు ఉంచుకొని రిలాక్స్ కావాలి. దీని వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
7. బంగాళాదుంప పొట్టు తీసి, దానికి కొద్దిగా పాలు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఆ మిశ్రమంలో రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలపాలి. ఈ ప్యాక్ ను మెడకు అప్లై చేసి, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మెడ చుట్టూ నల్లబడ్డ చర్మం మిగిలిన చర్మం ఉన్న రంగులోకి వస్తుంది.



Click it and Unblock the Notifications
