Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
చిన్నవయసులోనే వృద్ధాప్యాన్ని నివారించండిలా...!
ముఖచర్మం నల్లబడుతోంది. ఎన్ని క్రీములు రాసినా సాధారణరంగులోకి రావడం లేదు, సౌందర్య చికిత్స ఏదైనా ఉంటే చెప్పండ'ని వేసవిలో చాలామంది అడుగుతుంటారు. ఇలా అడిగే వారిలో ఇరవై, ముప్పై లోపు వయసువారే ఎక్కువగా ఉంటున్నారు. యవ్వనంలోనే వయసు పైబడిన వారిలా కనిపిస్తుంటారు. దీనికి కారణాలు.. స్ట్రెస్, పోషకాహార లేమి, జీవనశైలి సక్రమంగా లేకపోవడం. సౌందర్య లేపనాల కన్నా ముందు జీవనశైలిని మార్చుకోవడం మిన్న.
మానసిక ఒత్తిడి (స్ట్రెస్):
చదువు, ఉద్యోగం, వృత్తిపరమైన ఒత్తిడి ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. దీనివల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది. చర్మం పిగ్మెంటేషన్‌కు లోనవుతుంది. కళ్లకింద నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. ఫలితంగా ముఖ కాంతి కోల్పోయి, వయసు పైబడినట్టుగా కనిపిస్తారు. ముందుగా స్ట్రెస్ నివారణకు తగిన చికిత్స తీసుకోవాలి. అలాగే తినడం, తాగడం, నిద్రించడం.. జీవనశైలిలో వచ్చిన మార్పులను సవరించుకోవాలి. రోజూ గంటసేపు వ్యాయామాలు చేయడం, వారాంతంలోనైనా ఆటలకు ప్రాముఖ్యం ఇవ్వడం, రకరకాల కాలుష్యాల బారిన పడకుండా తమని తాము కాపాడుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. యోగా, ధ్యానం వంటి ప్రక్రియలను దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతత లభిస్తుంది. స్ట్రెస్ లెవల్స్ తగ్గితే చర్మకాంతి పెరుగుతుంది.
పోషకాల జ్యూస్‌లు:
రోగనిరోధకశక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడంలో శ్రద్ధ పెట్టాలి. వాల్‌నట్స్, బాదంపప్పులు ఆహారంలో భాగంగా చేర్చాలి. రాత్రి పడుకునేముందు కప్పుడు గోరువెచ్చని పాలు తాగాలి. పుచ్చకాయ, కర్బూజ, బొప్పాయి, ద్రాక్ష... వంటి నీరు ఎక్కువుండే పళ్లు తీసుకోవాలి. వేసవిలో దాహం ఎక్కువ అవుతుంటుంది. అయితే, నీళ్లతో సరిపెట్టకుండా శక్తినిచ్చే జ్యూస్‌లను తీసుకుంటే కోల్పోయిన పోషకాలను శరీరం తిరిగి భర్తీ చేసుకోగలదు. దీంతో చర్మానికి యవ్వనకాంతి లభిస్తుంది.

ఎండ నుంచి చర్మరక్షణ:
వేసవిలో ఎండతాకిడి వల్ల చర్మం కమిలిపోవడం, నల్లబడటం ఎక్కువైపోతుంటుంది. స్వేదరంధ్రాలు దెబ్బతింటాయి. దీంతో చర్మం మరింత నల్లగా మారుతుంది. అందుకని బయటకు వెళ్లేముందు సన్‌ప్రొటెక్షన్ క్రీమ్ (ఎస్.పి.ఎఫ్) రాసుకోవాలి. పెరుగు, పుచ్చకాయగుజ్జులతో ఫేస్‌ప్యాక్‌లు వేసుకుంటే చల్లగానూ ఉంటుంది. చర్మం నిగారింపు పెరుగుతుంది.
శిరోజాలు:
వేసవిలో చెమటతో మాడు త్వరగా జిడ్డుగా మారుతుంది. శుభ్రపరుచుకోకపోతే చుండ్రు సమస్య తలెత్తుతుంది. దీనివల్ల జుట్టు రాలడం కూడా పెరుగుతుంది. జిడ్డు అవుతుంది కదా అని రోజూ తలమీదుగా నీళ్లు పోయడం, షాంపూల వాడకం ఎక్కువ అవడం వల్ల వెంట్రుకలు చిట్లి జుట్టు పీచులా మారిపోతుంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే రాత్రిపూట గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకోవాలి. మరుసటిరోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఎక్కువగా నీళ్లు, పండ్ల రసాలు తాగాలి. నేరుగా ఎండపడకుండా హ్యాట్, గొడుగు వంటి వాటితో శిరోజాలకు రక్షణ కల్పించాలి. వారానికి ఒకసారి పెరుగును జుట్టుకు పట్టిస్తే చల్లగానూ ఉంటుంది, మంచి కండిషనర్‌లాగా పనిచేస్తుంది.
మనం తీసుకునే జాగ్రత్తలే ఆరోగ్యాన్నీ, అందాన్నీ కాపాడతాయి. అప్పుడే నాణ్యమైన సౌందర్య ఉత్పత్తులను వాడి పెరిగే వయసును కూడా తగ్గించుకోవచ్చు.



Click it and Unblock the Notifications