Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నల్లగా ఉన్నవారిని తెల్లగా మార్చే బాదం ఫేస్ మాస్క్
మహిళలు సాధారణంగా సాధ్యమైనంత వరకూ తెల్లగా ఉండాలని కోరుకుంటారు. అందుకే చాలా మంది ఇన్ స్టాంట్ ఫెయిర్ నెస్ కోసం వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ, మార్కెట్లో అందుబాటులో ఉండే కమర్షియల్ బ్యూటీ ప్రొడక్ట్స్ అనుకోకుండా సైడ్ ఎఫెక్ట్స్ కు గురిచేస్తాయి. బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకోవలనుకొన్నప్పుడు నేచురల్ మరియు సురక్షిత పద్దతులను ఎంపిక చేసుకోవడం మంచిది. ఇది తక్షణ ప్రభావం చూపకపోయినా, నిధానంగా మంచి పరిస్కారం మార్గం చూపుతుంది. ఎఫెక్టివ్ ఫలితాలను చూపెడుతుంది. హోం బేస్డ్ రెమడీలు మరియు హోం మేడ్ ట్రీట్మెంట్ లో బాదం ఒక టాప్ లిస్ట్ లో ఉంటుంది.
స్కిన్ వైటనింగ్ (చర్మం తెల్లగా)కాంతివంతంగా మార్చుకోవడం కోసం బాదం, మరియు బాదం ఆయిల్ ఎకనామికల్ గా మరియు నేచురల్ గా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ నట్స్ చర్మంను తెల్లగా మరియు కాంతివంతంగా మార్చే లక్షణాలతో పాటు విటమిన్ ఇ అధికంగా ఉన్నాయి. ఇటువంటి బాదం మరియు బాదం ఆయిల్ తో తయారుచేసుకొనే హోం మేడ్ ఫేస్ ప్యాక్ వల్ల అనుకోని ఆశ్చర్యకరమైన ఫలితాలను మీకు అందిస్తుంది . మిమ్మల్ని రిలాక్స్ గా ఉంచడంతో పాటు కాంతివంతంగా మార్చడాంలో బాదం బాగా సహాయపడుతుంది.

బాదంలను తినడం మాత్రమే కాకుండా వీటితో అనేక విధాలుగా ఉపయోగించి బ్యూటిఫుల్ స్కిన్ ను పొందవచ్చు. బాదంలో ఉన్న విటమిన్ ఇ వల్ల సూర్యని యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. కాబట్టి చర్మం అందానికి బాదంను వివిధ రకాలుగా ఉపయోగించడానికి వివిధ మార్గాలున్నాయి. మీ చర్మంఛాయను మెరుగుపరుచుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ పద్దతులు క్రింది విధంగా...
1. బాదం -పాలు ఫేస్ ప్యాక్ : రెండు టేబుల్ స్పూన్ల బాదం పొడి ని తాజాగా ఉండే పాలలో మిక్స్ చేయాలి. చిక్కటి పేస్ట్ లా తయారయ్యే వరకూ మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను మీరు నిద్రించడానికి ముందు మీ ముఖానికి అప్లై చేయాలి. 10-15అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. బాదం పాలు కాంబినేషన్ ఫేస్ ప్యాక్ బెస్ట్ రిజల్ట్ ను అంధిస్తుంది
2. బాదం, గుడ్డు మరియు నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్ బాదం పౌడర్ అందులో ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ రెంటింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం కూడా వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం త్వరగా తెల్లగా మారుతుంది.
3. బాదం ఆయిల్ మసాజ్: బాదం నూనెను మీ ముఖానికి మరియు శరీరానికి పట్టించి బాగా మసాజ్ చేయడం వల్ల ఎఫెక్టివ్ గా చర్మం తెల్లగా మారుతుంది. బాదం నూనెను ముఖం మరియు శరీరానికి పట్టించి అరగంట అలాగే ఉంచి తర్వత శుభ్రం చేసుకోవడం వల్ల బ్లడ్ సర్కులేషన్ పెరిగి చర్మంకాంతివంతంగా మారుతేంది.
4. బాదం మరియు తేనె: చర్మం కాంతిని వేగవంతంగా పెంచుకోవడానికి బాదం మరియు తేనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . కొన్ని బాదంలను నీళ్ళలో నానబెట్టి, తర్వాత రోజు ఉదయం వాటికి పొట్టు తీసి, తేనె మిక్స్ చేసి, ముఖం మరియు శరీరానికి పట్టించాలి. కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. తేనె మిక్స్ చేయడం వల్ల ముఖంలో ఏర్పడ్డ మచ్చలు చాలా తేలికగా తొలగిపోతాయి.
5. బాదం -ఓట్స్ ఫేస్ ప్యాక్: మెత్తగా పౌడర్ చేసిన ఓట్స్ కు కొద్దిగా బాదం పొడి రెండు టీస్పూన్ల పచ్చిపాలు కూడా వేసి బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. డ్రై స్కిన్ కలిగి వారికి ఈ ఫేస్ మాస్క్ బాగా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications