Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
చర్మఛాయను మెరుగుపరిచే ఆకుకూరల రసం
ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఆకుకూరల్లో విటమిన్స్, మినిరల్స్ మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాదు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉడికించకుండా ఉండే ఆకుకూరల్లో కెరోటిన్స్, అమినోఆసిడ్స్, పొటాషియం మరియు ఐయోడిన్ మరియు విటమిన్స్ ఎ, కె, సి మరియు బి కాంప్లెక్స్ లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇందులో ఆల్కలైన్ మినిరల్స్ కూడా శరీరం యొక్క పిహెచ్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది.
ఆకుకూరల్లో మాంసాహారాల్లో కంటే అధికంగా న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఇది చాలా ఆరోగ్యకరమైనది. కాబట్టి, ఉడికించిన మరియు పచ్చి ఆకుకూరలు ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలు అందివ్వడంతో పాటు శరీరం, మరియు చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది ఆకుకూరలు శరీరానికి మరియు చర్మానికి వివిధ రకాలుగా సహాయపడుతుంది. మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది . ఆకుకూరలు ప్రమాదకర వ్యాధులను నివారిస్తుంది మరియు గుండె జబ్బులను రాకుండా రక్షిస్తుంది . ఆకుకూరల రసంతో చర్మానికి కొన్ని ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ....

మొటిమల నివారణకు
మొటిమల నివారణకు ఆకుకూరల రసం గొప్పగా సహాయపడుతుంది. మొటిమలను నివారించి క్లియర్ స్కిన్ అందిస్తుంది . ఆకుకూరల రసం కోసం ఆకుకూరలను మిక్సీలో వేసి బ్లెడ్ చేయాలి. ఈ రసాన్ని ముఖానికి అప్లై చేసి 15-20నిముషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో మురికి, దుమ్ము, ధూళీ తొలగిపోయి రిఫ్రెష్ స్కిన్ పొందవచ్చు. అలాగే ఆకుకూరల జ్యూస్ త్రాగడం వల్ల కూడా మొటిమలను నివారించవచ్చు. అలాగే ఈ ఆకుకూరల రసంలో టమోటో, క్యారెట్, కీరదోసకాయ రసాన్ని కూడా మిక్స్ చేస్తే మొటిమలు మరింత ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి.

యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్
ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంలో ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. ఈ ఫ్రీరాడికల్స్ మీ చర్మంలో చిన్న వయస్సులోనే పెద్దవారిలా కనబడేలా చేస్తుంది. స్పినాచ్ జ్యూస్ ఆరోగ్యంగా మరియు ప్రకాశించే చర్మంను అంధిస్తుంది.

సన్ టాన్ నుండి రక్షణ కల్పిస్తుంది
చర్మానికి ఆకుకూరలు గొప్ప ప్రయోజనాలను అంధిస్తుంది. ఆకుకూరల్లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఆకుకూరల్లో విటమిన్ బి కాంప్లెక్స్ అదికంగా ఉంటుంది. ఈ బికాంప్లెక్ సన్ టాన్ నివారించి చర్మానికి రక్షణ కల్పిస్తుంది . కాబట్టి, మీరు ఆకుకూరల రసాన్ని తీసుకొన్నప్పుడు ఇది టానింగ్ ను నివారిస్తుంది.

కంప్లెక్షన్ బెనిఫిట్స్
ఆకుకూరల్లో విటమిన్ కె మరియు ఫొల్లెట్ అధికంగా ఉండటం వల్ల ఇది చర్మ కాంతిని ఇనుమడింప చేస్తుంది . ఇది చర్మంను క్లియర్ గా మార్చడానికి సహాయపడుతుంది . మొటిమలు లేకుండా నివారిస్తుంది. డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది మరియు ఇతర సమస్యలు లేకుండా నివారిస్తుంది . మీరు పొడి లేదా దురద కలిగించే చర్మ సమస్యతో బాధపడుతున్నట్లైతే ఈ సమస్యను కూడా ఆకుకూరలు తొలగిస్తుంది . కాబట్టి, సాధరణంగా ఆకుకూరలు రెగ్యులర్ గా తింటే బెటర్ కంప్లెక్షన్ ను అంధిస్తాయి .ప్రకాశవంతమైన చర్మానికి ఆకుకూరలు చాలా అవసరం.

చర్మాన్ని మరమ్మత్తు చేస్తుంది
ఆకుకూరల రసంలో విటమిన్ ఎ మరియు సి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ చర్మకాంతిని మెరుగుపరచడానికి సహాయపడితే విటమిన్ సి ఆరోగ్యకరమైన్ స్కిన్ సెల్స్ పెరుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి మీకు రేడియంట్ మరియు గ్లోయింగ్ స్కిన్ మీరు పొందాలంటే ఆకుకూరల రసాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది చర్మాన్ని శుభ్రం చేసి క్లియర్ కంప్లెక్షన్ ను అంధిస్తుంది.



Click it and Unblock the Notifications