Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బ్లాక్ హెడ్స్ తొలగించి, గ్లోయింగ్ స్కిన్ అందించే ఫ్రూట్ స్క్రబ్స్
అనేక చర్మ సమస్యలతో సతమతమయ్యే వాళ్లు ఫ్రూట్ స్క్రబ్స్ బెస్ట్ సొల్యూషన్స్. యాక్నె, బ్లాక్ హెడ్స్ తొలగించడానికి కొన్ని రకాల ఫ్రూట్స్ తో స్ర్కబ్ చేయడం వల్ల సులువుగా తొలగించుకోవచ్చు. బ్లాక్ హెడ్స్ తొలగిపోవడమే కాకుండా.. చర్మం గార్జియస్ గా కనిపిస్తుంది.
ఇక్కడ చెప్పబోయే పండ్ల నుంచి గుజ్జు, సీడ్స్ తీసి చర్మంపై అప్లై చేయాలి. ఈ పండ్లలో ఉండే ప్రొటీన్స్, విటమిన్స్ చర్మానికి మంచి పోషణను అందించి.. అందమైన చర్మం పొందడానికి సహాయపడుతుంది. అలాగే చర్మంపై బ్లాక్ హెడ్స్ తొలగించడానికి సహాయపడతాయి. అయితే ఈ ఫ్రూట్ స్క్రబ్స్ ఉపయోగించడానికి ముందు.. ముఖాన్ని కోల్డ్ మిల్క్ లేదా రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే.. ఈ రెండు పదార్థాల్లో ఉండే కూలింగ్ గుణాలు.. చర్మానికి ఉపశమనం కలిగిస్తాయి.
ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని అందించే ఫ్రూట్ జ్యూసులు
ఈ ఫ్రూట్స్ నుంచి గుజ్జు తీసి ముఖంపై కింది నుంచి పైకి మసాజ్ చేసి.. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోయి.. ముఖంపై గుంతలు మూసుకుపోతాయని బ్యూటీ ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. వారం తర్వాత మళ్లీ అప్లై చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ కంప్లీట్ గా తొలగిపోతాయట. మరి బ్లాక్ హెడ్స్ తొలగించే ఫ్రూట్స్ ఏంటో చూద్దామా..

పుచ్చకాయ
సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ వాటర్ మెలాన్ ని చర్మానికి ఉపయోగించడం వల్ల చర్మం రిఫ్రెష్ అవుతుంది. అలాగే గుంతలు కనిపించకుండా చేసి.. బ్లాక్ హెడ్స్ తొలగిపోయేలా చేస్తుంది. కాబట్టి పుచ్చకాయ గుజ్జు, విత్తనాలతో బాగా మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

యాపిల్స్
రోజుకి ఒక యాపిల్ తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్స్ దూరంగా ఉంటాయి. అలాగే.. యాపిల్ గుజ్జుతో ముఖంపై 10 నిమిషాలు మసాజ్ చేసి.. ఆరిన తర్వాత కోల్డ్ మిల్క్ తో శుభ్రం చేసుకుంటే.. బ్లాక్ హెడ్స్ ఈజీగా తొలగిపోతాయి.

కివి
కివి ఫ్రూట్ స్కిన్ ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటుంది. కాబట్టి కివీ ఫ్రూట్ ని సగానికి కట్ చేసి.. ముఖంపై బాగా మసాజ్ చేయడం వల్ల.. బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. 15 నిమిషాలు మసాజ్ చేస్తే చర్మం స్మూత్ గా మారుతుంది.

పియర్
పియర్ ఫ్రూట్ ని రెండు ముక్కలుగా కట్ చేసి.. గుజ్జు తీయాలి. దాన్ని మెత్తగా చేసుకుని.. చేతి వేళ్లతో మసాజ్ చేయాలి. 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుని మళ్లీ మసాజ్ చేయాలి.

పైనాపిల్
పైనాపిల్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ ఎలాంటి చర్మ సమస్యనైనా నయం చేస్తుంది. కాబట్టి పైనాపిల్ ని కట్ చేసుకుని.. ముఖంపై మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్రూట్ ని డైరెక్ట్ గా ముఖంపై మసాజ్ చేయాలి. తర్వాత చల్లటి నీళ్లు లేదా పాలతో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫ్రూట్ మసాజ్ వల్ల చర్మంపై గుంతలు మాయమవడమే కాకుండా.. బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

టొమాటొ
బాగా పండిన టమోటా తీసుకుని కట్ చేయాలి. కట్ చేసిన టమోటాతో.. ముఖంపై బాగా మర్దనా చేయాలి. టమోటాలో ఉండే గింజలను.. బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో ఉపయోగించాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల.. చర్మంపై ఉండే బ్లాక్ హెడ్స్ తొలగిపోయి.. చర్మం నిగారిస్తుంది.



Click it and Unblock the Notifications