Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
యవ్వనంగా...గ్లోయింగ్ స్కిన్ తో కనబడాలంటే 7 బెస్ట్ ఫ్రూట్ జ్యూస్ లు
సాధారణంగా మన పెద్దలు దాహం వేసినా, లేకపోయినా, రోజంతా నీరు ఎక్కువగా తాగాలని చెబుతుంటారు ఎందుకు? మన శరీరంలో చేరిన టాక్సిన్స్ (వ్యర్థాలను)బయటకు నెట్టివేయడానికి మరియు మన శరీరం రోజంతా తేమగా ఆరోగ్యంగా ఉండటానికి నీరు చాలా అవసరం అవుతుంది. ఆరోగ్యానికి మాత్రమే కాదు, యవ్వనంగా గ్లోయింగ్ స్కిన్ తో చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుండాలంటే నీరు అత్యంత అవసరం అవుతుంది.
అయితే, ప్లెయిన్ వాటర్ మాత్రమే ఎందుకు జ్యూసులెందుకు త్రాగడకూడదు? జ్యూసులు మన శరీరానికి అవసరం అయ్యే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ మరియు మినిరల్స్ ను పుష్కలంగా అందిస్తాయి. అంతే కాదు ఇవన్నీ కూడా మన చర్మ ఆరోగ్యానికి, అందానికి చాలా అవసరం అవుతాయి.
ఆశ్చర్యం కలిగించే బీట్ రూట్ చర్మ సౌందర్య రహస్యాలు
ఈ జ్యూస్ లు వల్ల చర్మం చాలా సున్నితంగా, నైస్ గా సాఫ్ట్ గా మెరుస్తుంటుంది. ఉండాల్సిన దానికంటే మరింత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. జ్యూసుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ చర్మం మీద ఎలాంటి గాయాలున్న, ఇన్ఫెక్షన్సున్నా వేగంగా నయం చేస్తాయి. అంతే కాదు వాటి స్థానంలో కొత్త స్కిన్ సెల్స్ ఏర్పడుతాయి.
కొన్ని సమయంలో లివర్లో నిండి ఉన్న టాక్సిన్స్ వల్ల చర్మం డల్ గా మరియు డార్క్ గా కనబడుతుంది. అలాంటి ప్రమాధకర టాక్సిన్స్ ను నివారించడానికి ఈ జ్యూసులు ఎంతగానో ఉపయోగపడుతాయి. దాంతో చర్మంలో మార్పులను గుర్తించవచ్చు. లివర్లోని టాక్సిన్స్ తొలగించడం వల్ల ఒక్క చర్మ ఆరోగ్యానికి మాత్రమే కాదు, శరీర ఆరోగ్యానికి కూడా చాలా మేలు జరగుతుంది.
టమోటో జ్యూస్ తో అందాన్ని రెట్టింపు చేసుకోండి
అంతే కాదు, జ్యూసులను శరీరం చాలా బాగా గ్రహిస్తుంది. దాంతో పాటు, చాలా వేగంగా చర్మంలో మార్పులను ఎఫెక్టివ్ గా చూపెడుతుంది. ఈ రకమైన జ్యూసులను వాటర్ తో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల వాటర్ కంటెంట్ మరింత పెరుగుతుంది.
ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని అందించే ఫ్రూట్ జ్యూసులు
కొన్ని రకాల జ్యూసులు, కీరదోస జ్యూస్, పుచ్చకాయ వంటి వాటికి ఎక్కువ నీరు చేర్చాల్సిన అవసరం లేదు . వీటిలో వాటర్ కంటెంట్ అంధికంగా ఉంటుంది. మరి చర్మకాంతిని పెంచే కొన్ని జ్యూసులు ఈ క్రింది విధంగా....

చర్మం యవ్వనంగా కనబడాలంటే క్యారెట్ జ్యూస్:
క్యారెట్ జ్యూస్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. ఇది చర్మంను శుభ్రం చేస్తుంది . దాంతో చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది. క్యారెట్ జ్యూస్ మీ చర్మం ఆరోగ్యంగా మరియు యంగర్ లుక్ తో కనబడేలా చేస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది.

స్కిన్ హీలింగ్ కోసం దానిమ్మ జ్యూస్:
చర్మాన్ని మరమత్తు చేయడం మాత్రమే కాదు, కొత్తగా చర్మ కణాలు ఏర్పడుటకు కూడా సహాయపడుతుంది . దానిమ్మ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. ఇంకా చర్మానికి అవసరం అయ్యే తేమను అందిస్తుంది. ఏజింగ్ లక్షణాలను మాయం చేస్తుంది.

మొటిమలను నివారించి, చర్మం పింక్ గా మార్చే గ్రేప్ జ్యూస్ :
గ్రేప్ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ప్రతి రోజూ గ్రేప్ జ్యూస్ ను తాగడం వల్ల మీ చర్మం ఫ్రెష్ గా మరియు మెరుస్తుండేలా చేస్తుంది. అంతే కాదు చర్మంలో గులాబి మెరుపులు తీసుకొస్తుంది . చర్మంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

డల్ స్కిన్ నివారించే చెర్రీ జ్యూస్:
చర్మంలో టాక్సిన్స్ నివారించడానికి చెర్రీ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో ముఖంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దాంతో చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది. ఇది ఇంకా ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. దాంతో డల్ స్కిన్ నివారిస్తుంది. చెర్రీ జ్యూస్ లివర్ ను క్లీన్ చేస్తుంది. దాంతో చర్మం ఫ్రెష్ గా కనబడేలా చేస్తుంది.

టమోటో జ్యూస్:
టమోటాల్లో లైకోపిన్ అధికంగా ఉంటుంది. ఇది బాడీలో యాంటీఆక్సిడెంట్స్ ను తొలగించి చర్మం కాంతివంతం చేస్తుంది . జిడ్డు చర్మాన్ని నివారిస్తుంది. క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. టమాటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌లాగా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు లేదా చక్కెర వేసుకుని తీసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది .అలాగే ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. విటమిన్స్ కూడా లభిస్తాయి.

కుకుంబర్ జ్యూస్:
కుకుంబర్ జ్యూస్ స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. దాంతో చర్మంలో ఎలాంటి స్కార్స్ , మార్క్స్ కనబడవు. ఇందులో వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. దాంతో చర్మం కాంతివంతంగా, యంగ్ గా కనబడుతుంది. అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. కిడ్నీలను శుభ్రపరిచి అధికంగా ఉండే రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. అన్ని రకాల చర్మ సమస్యలను నివారించడానికి దోహదపడుతుంది. దోసకాయ రసం ఇది కీళ్ళ వ్యాధులను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.

ఆరెంజ్ జ్యూస్:
నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్ ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది. ముఖంలో ముడుతలను నివారిస్తుంది.ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది. రోజుకు రెండు వందల గ్రాముల విటమిన్ సి అవసరమవుతుంది. నారింజ జ్యూస్ తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది. నారింజ తొనల గుజ్జు తీసుకుని అందులో కీరదోస కాయ తురుము, నాలుగైదు చుక్కల నిమ్మరసం, చెంచా తేనె లేదా కలబంద గుజ్జు కలిపి ముఖానికి పూతలా వేసుకొని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కళ్ళమీద కూడా పెట్టుకోవచ్చు.



Click it and Unblock the Notifications











