Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
అందంగా కనిపించాలంటే నిద్రలేచిన తరువాత ఒక్క నిమిషం ఇలా చేయాలి!
చాలా మందికి మేకప్ లేకుండా సహజసిద్ధంగానే అందంగా కనిపించాలని ఉంటుంది. అందుకోసం సహజసిద్ధమైన మెడిసిన్స్, క్రీమ్స్ వాడుతుంటారు. ఇంకొందరు రకరకాల ఫేసియల్స్ ట్రై చేస్తుంటారు. ఖరీదైన క్రీములు, ఇంటి చిట్కాలు పాటిస్తూ వందలో ఒక్కరు సక్సెస్ అయితే 99 మంది ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు.
అయితే ఇవేమీ లేకుండా సుఖమైనా నిద్ర ఉంటే అందంగా కనిపిస్తామని మీకు తెలుసా? నిద్ర మన శరీరం ఆరోగ్యాంగా ఉండేందుకు అలాగే మనకు అందాన్ని ఇచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే వైద్యులు సైతం ఎంత ఎక్కువగా నిద్రపోతే అంత మంచిదని చెప్తూ ఉంటారు. అయితే నిద్ర లేచిన తరువాత ఎలాంటి టిప్స్ పాటిస్తే చర్మం అందంగా కనిపిస్తుంది? అలాగే ఒక్క నిమిషంలోనే నిద్ర పట్టాలంటే ఏం చేయాలనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నిద్ర లేచిన తరువాత ఇలా చేయండి..
సాధారణంగా ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని అనుకుంటూ ఉంటారు. అది మనలోని విశ్వాసాన్ని పెంపొందించి ఏ పనినైనా చేయడానికి ప్రేరేపిస్తుంది. అయితే అందంగా కనిపించేందుకు ప్రతిరోజూ ఉదయం లేవగానే ముఖాన్ని చన్నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మంలోని సెల్స్ యాక్టివేట్ అవుతాయని, చర్మంపై ఏదైనా చెడు క్రీములు ఉన్నా తొలిగిపోతాయని చర్మ నిపుణులు చెబుతున్నారు.
అలాగే రాత్రి పడుకునేటప్పుడు మాయిశ్చరైజర్ వేసుకుంటే.. ఉదయం వరకు అది ఒక పొరలాగా మారిపోతుందని, అది ఎక్కువసేపు ఉంటే చర్మానికి హాని చేస్తుందని అందుకే దాన్ని కడుక్కోవాలి సూచిస్తున్నారు.
వ్యాయామం..
శరీరానికి వ్యాయాయం ఎంత అవసరమో ముఖానికి కూడా వ్యాయాయం కూడా అంతే అవసరం. ముఖం తొందరగా ముదిరిపోయినట్లు కనిపించకూడదంటే? ముఖానికి సంబంధించిన వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు పొందొచ్చు. ముఖంలోని కండరాలు కదిలి మనిషి యవ్వనంగా, అందంగా కనిపించేందుకు సహాయపడతాయి. ఉదయం లేచిన తరువాత కొద్దీ నిమిషాల పాటు ఈ వ్యాయామం చేస్తే మంచి ఫలితాలను పొందొచ్చు.
తగినంత నిద్రపోవాలి..
మనం ముందుగా చెప్పినట్లు అందమైన ముఖం కనిపించడానికి సరైన నిద్ర అవసరం. నిద్ర ఎంత మంచిగుంటే ముఖం కూడా అందంగా కనిపిస్తుంది. అయితే క్షణాల్లోనే నిద్రపట్టాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. వాటిలో ముఖ్యమైనది సాయంత్రం 7 గంటల తరువాత కాఫీ, టీ వంటి పానీయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగవద్దు. ఎందుకంటే కాఫీ, టీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చాలా సేపు నిలువ ఉంటుంది. తద్వారా ఇది నిద్రపట్టకుండా చేస్తుంది. తొందరగా నిద్రపోవాలంటే రాత్రి 7 గంటల తరువాత కాఫీ, టీల జోలికి వెళ్లకపోవడమే మంచిది.
వేడి నీరు లేదా పాలు తాగాలి
ప్రతిరోజూ నిద్రపోయే ముందు గోరు వెచ్చని నీళ్లు లేదా పాలు తాగితే చాలా మంచిది. ఇలా తాగడం వల్ల నిద్ర మంచిగా పడుతుంది. అలాగే క్షణాల్లోనే నిద్రలోకి జారుకోవచ్చు. పాలు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు దొరకడంతో పాటు నిద్ర కూడా చాలా మంచిగా పడుతుంది. అలాగే ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయడం వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది. తద్వారా మంచి ఆరోగ్యకరమైన జీవనాన్ని మనం అనుభవించవచ్చు.
స్నానం చేయడం..
రోజంతా ఎదో ఒక పనిలో బిజీగా ఉండి అలసిపోతుంటాం. రోజంతా పనుల వల్ల చెమట మన శరీరంపై నిండిపోతుంటుంది. పడుకునేటప్పుడు అది చిరాకును కలిగిస్తుంది. అందుకే ప్రతిరోజూ పడుకునే ముందు స్నానం చేసుకొని పడుకుంటే నిద్ర బాగా పడుతుంది. అలాగే చర్మ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించడింది. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications