Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
మహిళలు గాజులు వేసుకుంటే ఏమవుతుందో తెలుసా? వామ్మో భర్తకు ఇన్ని ప్రయోజనాలా?
హిందూ సంప్రదాయంలో చాలా ఆచారాలు ఉన్నాయి. పెళ్ళైన మహిళలు ధరించే కట్టు బొట్టు విధానంలో ప్రత్యేకమైన ఆచారాలు పాటించాల్సి ఉంటుంది. పెళ్లి కానీ మహిళలు కూడా ఓ విధమైన ఆచారాలను సైతం పాటించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే వివాహిత స్త్రీలు గాజులు ధరించాల్సి ఉంటుంది. ఈ ఆచారం ఆభరణం మాత్రమే కాదు, ఆ మహిళలు పెళ్లి అయ్యిందనే దానికి నిదర్శనం అని చెబుతుంటారు. అలాగే ఇందులో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని పేర్కొంటుంటారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి.
సానుకూల శక్తికి ప్రతిబింబం
పెళ్లి అయిన మహిళలు గాజులు ధరించడం వల్ల వారు సానుకూల శక్తిని అఆకర్షిస్తారట. దీని కారణంగా కుటుంబ శ్రేయస్సు మెరుగుపడుతుందని, కుటుంబంలోని వారంతా సంతోషంగా ఉంటారని చెబుతుంటారు. అలాగే గాజులు ధరించడం వల్ల అవి చేసే శబ్దానికి నరాలు ఉత్తేజితం అవుతాయని పేర్కొంటుంటారు. దీని వల్ల జ్ఞాపకశక్తి, మెదడు పనితీరు మెరుగుపడుతుందని నమ్ముతుంటారు.

రక్త ప్రసరణ మెరుగుపడుతుంది
గాజులు ధరించడం వల్ల గాజులు గాజులు రాసుకుంటాయి. దీని కారణంగా స్థిరమైన ఘర్షణ ఏర్పడుతుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. దీంతో శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరిగ్గా పంపు అయ్యి, గుండెపోటు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే గాజులు రింగ్ ఆకారంలో ఉంటాయి. దీని వల్ల శరీరం నుంచి విడుదలయ్యే సానుకూల శక్తి తిరిగి శరీరంలోకి వెళ్తుంది. దీని వల్ల మానసిక ప్రశాంత కలుగుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం దొరుకుతుంది. ప్రతికూల భావాలు తొలిగిపోతాయి.
అందుకే పూర్వికులు చెప్పేవారు
నానమ్మలు ఎప్పుడైనా చేతులు ఖాళీగా ఉండడం చూసి వెంటనే గాజులు వేసుకోండి అని చెప్పేవారు. ఇది కేవలం సంప్రదాయం అని మాత్రమే కాదు అందులో శాస్త్రీయత కూడా ఉందని వారికి తెలుసు కాబట్టే చెప్పేవారు. పైగా భర్త శ్రేయస్సుకు, ఆరోగ్యానికి కూడా మంచిదనే నమ్మకం కారణంగా వారెప్పుడూ దీని గురించి ప్రస్తావిస్తూనే ఉండేవారు. గాజులు కేవలం అలంకరణకు మాత్రమే కాకుండా మనలో శాస్త్రీయత, సానుకూల శక్తిని పెంపోందిస్తుంది.



Click it and Unblock the Notifications