Latest Updates
-
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.?
Bhumi Pednekar's Weight Loss Journey: ఎలాంటి డైటీషియల్ లేకుండా కొన్ని నెలల్లో 32 కిలోలు తగ్గిన భూమి పడ్నేకర్,
బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్.. కేవలం కొన్ని నెలల్లోనే 32 కిలోలు తగ్గింది. ఎలాంటి డైటీషియల్ సపోర్ట్ లేకుండా అన్ని కిలోలు ఎలా తగ్గిందో ఇప్పుడు తెలుసుకుందాం.
భూమి పడ్నేకర్.. ఒకప్పుడు 89 కిలోల వరకు బరువు ఉండేది. బాలీవుడ్ బొద్దు గుమ్మ అనే పేరు తెచ్చుకుంది. తను సోషల్ మీడియాలో ట్రోల్ కూడా ఎదుర్కొంది. సీన్ కట్ చేస్తో కొన్ని నెలల గ్యాప్ లో తను నాజుకుగా దర్శనమిచ్చింది. 89 కిలోలు ఉన్న భూమి పడ్నేకర్.. ఏకంగా 57 కిలోలకు తగ్గింది. అంటే 32 కిలోల బరువు తగ్గి చాలా నాజూకుగా, పర్ఫెక్ట్ స్ట్రక్చర్ తో, సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది. బొద్దుగుమ్మ అన్న వారే వావ్ అంటూ చొంగకార్చుకునేలా చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ.

2015లో వచ్చిన దమ్ లగా కే హైషా మూవీ ద్వారా సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది భూమి పడ్నేకర్. ఈ సినిమా కోసమే 30 కిలోల బరువు పెరిగింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో భూమి పడ్డ కష్టానికి గుర్తింపు లభించింది. తర్వాత మరెన్నో సినిమాల్లోనూ నటించింది ఈ బ్యూటీ.
తర్వాతే తన వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసింది. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే భూమి పడ్నేకర్ ఏకంగా 32 కిలోలు తగ్గింది. అదిరిపోయే ఫిగర్ తో దర్శనమిచ్చింది. ఇందుకోసం భూమి ఏ డైటీషియన్ ను నియమించుకోలేదు, ఎలాంటి శస్త్ర చికిత్స చేయలేదు. కేవలం కచ్చితమైన డైట్ పాటించింది, వర్కవుట్స్ చేసింది.

చక్కెర తినడం పూర్తిగా మానేసింది:
భూమి గొప్ప భోజన ప్రియురాలు. అన్ని రకాల వంటకాలు ఆరగిస్తుంది. నెయ్యి, వెన్న, మజ్జిగ ఎక్కువగా తింటుంది. బరువు తగ్గాలనుకున్నప్పుడు కూడా తను ఇవేవీ వదులుకోవడానికి సిద్ధంగా లేదు.
తన ఇష్టమైన ఆహార పదార్థాలు తింటూనే చక్కెర వాడకాన్ని పూర్తిగా తగ్గించింది. చక్కెరకు బదులుగా సహజ స్వీటెనర్లు తీసుకుంది. తన రెగ్యులర్ డైట్ ను అనుసరిస్తూ కార్బొహైడ్రేట్ తీసుకోవడాన్ని నియంత్రించింది. ప్రతి ఐదు రోజులకోసారి చీట్ మీల్ కూడా చేసేది.

డైటీషియన్ వద్దకు వెళ్లింది లేదు:
భూమి పడ్నేకర్ బరువు తగ్గడం కోసం ఏ డైటీషియన్ ను కలవలేదు, సంప్రదించలేదు. గూగుల్ లో సమాచారం వెతికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుంది. అలాగే తన తల్లి కూడా భూమికి హెల్ప్ చేసింది. బరువు తగ్గడానికి అతి ముఖ్యమైనది ఇంట్లో వండిన భోజనమే తినాలని చెబుతుంది భూమి. తల్లి చెప్పిన విషయాలు, గూగుల్ సెర్చ్ లో తెలుసుకున్న వివరాలతో పక్కాగా ఓ డైట్ ప్లాన్ సిద్ధం చేసుకుంది.

రోజూ 7 లీటర్ల నీరు:
బరువు తగ్గించే పదార్థాల్లో నీరు చాలా కీలకమని చెప్పింది భూమి పడ్నేకర్. తాను రోజుకు 7 లీటర్ల నీటిని తాగేది. కేవలం నీరు తాగితే ఒకటీ రెండు రోజులయ్యాక తాగాలనిపించేది కాదని అందుకే తానో ఐడియా కనిపెట్టినట్లు చెప్పింది భూమి పడ్నెకర్.
తాను తాగే నీటిలో నిమ్మరసం, పుదీనా, దోసకాయ వేసుకుని వాటినే రోజంతా సిప్ చేస్తూ ఉండేది.

భూమి పడ్నేకర్ డైట్ ప్లాన్:
* ఉదయం లేవగానే గోరు వెచ్చని నీరు తాగుతుంది.
* 30 నిమిషాల తర్వాత వెన్న తీసిన పాలు, అవిసె, పొద్దు తిరుగుడు గింజులు తీసుకుంటుంది.
* కొంత సేపటి తర్వాత పెద్ద మొత్తంలో అల్పాహారం తింటుంది.
* అల్పాహారంలో రెండు ఉడికించిన గుడ్లు, తెల్లసొనతో చేసిన ఆమ్లెట్, గోధుమ రొట్టే, ఫ్రూట్ సలాడ్ ఉంటాయి.
* గంట తర్వాత వర్కవుట్స్ చేస్తుంది.

మధ్యాహ్న భోజనం:
* రోటీ, సబ్జీ, పప్పుతో కలిపిన ఆహారం తీసుకుంటుంది.
* రోటీలను గోధుమలతో కాకుండా బజ్రా, జోవర్, నాచ్నీ, సోయా, చానా, రాజ్ గికాతో తయారు చేసిన రోటీలను మాత్రమే తింటుంది.
* రోటీతో పాటు దాల్ తడ్కా తింటుంది.
* చాలా తక్కువ మొత్తంలో ఆలివ్ నూనె వేసి తయారు చేసిన సబ్జీ తీసుకుంటుంది.
* ఇంట్లో తయారు చేసిన పెరుగు లేదా మజ్జిగ తీసుకుంటుంది.

సాయంత్రం స్నాక్స్:
* సాయంత్రం 4 గంటలకు సగం బొప్పాయి లేదా ఒక యాపిల్ లేదా జామ లేదా పియర్ తీసుకుంటుంది.
* నాలుగైదు బాదం లేదా వాల్ నట్ అలాగే ఒక కప్పు గ్రీన్ టీ తాగుతుంది.

రాత్రి భోజనం:
* రాత్రి 8.30 గంటలకు భోజనం ముగిస్తుంది.
* ఆకుకూరలు, ఆపిల్, వాల్ నట్లు, ఎండిన బెర్రీలతో కూడిన సలాడ్ తీసుకుంటుంది.
* ఈ సలాడ్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్, బాల్సమిక్ వెనిగర్, వెల్లుల్లి, ఆవాలతో కొంత ఆలివ్ చిల్లీ ఆయిల్ తో రుచిని జోడిస్తుంది.
* అప్పుడప్పుడు కాల్చిన చికెన్, చేపలు, ఫెటా చీజ్ ను కూడా తింటుంది.
* లైట్ గా వండిన పనీర్ లేదా టోఫు, చిన్న కప్పు పరిమాణంలో ఆవిరిపై ఉడికించిన కూరగాయలను కూడా అప్పుడప్పుడు తీసుకుంటుంది.
* అప్పుడప్పుడు బ్రౌన్ రైస్, సన్నని మల్టీ గ్రెయిన్ రోటీ తీసుకుంటుంది.

భూమి పడ్నేకర్ ఫిట్‌నెస్:
కొవ్వును కరిగించడంతో పాటు లీన్ మజిల్ మాస్ నిర్మించడానికి అవసరమయ్యే వ్యాయామాలు చేసింది భూమి పడ్నేకర్.
* కొవ్వు కరగడానికి కార్డియో వ్యాయామాలు చేసింది.
* లీన్ మజిల్ మాస్ కోసం వెయిట్ ట్రైనింగ్ చేసింది.
* అలాగే ఇంట్లోనూ, బయట ఎక్కువ సేపు ఒకేచోట ఉండకుండా అటూ ఇటూ నడవడానికి ఇష్టపడేది.



Click it and Unblock the Notifications