Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
2025లో బరువు తగ్గాలనుకుంటే తప్పక పాటించాల్సిన ఏడు విషయాలు!
ఇంకా కొన్ని గంటల్లో మనం 2025లో ప్రవేశించబోతున్నాము. ప్రతిసారి మనం ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంలోకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని రిజల్యూషన్స్ తీసుకెళ్తుంటారు. ఆ రిజల్యూషన్స్ కొన్ని జీవితానికి సంబంధినవి అయితే, మరికొన్ని ఆరోగ్యానికి సంబంధించినవి, ఇంకొన్ని ఫైనాన్సియల్‌కు సంబంధించినవి ఉంటాయి. అయితే చాలా మంది 2025లో బరువు తగ్గాలని రిజల్యూషన్ తీసుకుంటారు.
బరువు తగ్గాలంటే కేవలం డైట్, వ్యాయామం మాత్రమే సరిపోదు. కొన్ని అలవాట్లను క్రమం తప్పకుండా పాటించాలి. ఈ నూతన సంవత్సరంలో బరువు తగ్గాలని మీరు తీర్మానం చేసినట్లయితే, ఈ క్రింది 7 అలవాట్లను గుర్తుంచుకోండి. ఇది ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని సాధించడంలో మీకు సహాయం చేస్తుంది.

ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకోండి
బరువు తగ్గాలంటే ముందుగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్తీగా బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. దాని కోసం మీరు న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి, అతని సలహా మేరకు మీ శరీరానికి తగిన డైట్ ప్లాన్‌ను తయారు చేయమని అడగాలి. అలాగే దానిని క్రమం తప్పకుండా పాటించాలి. అలాగే ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలి.
హైడ్రేటెడ్‌గా ఉండండి
మీరు బరువు తగ్గాలనుకుంటే, ఎక్కువ నీరు త్రాగాలి. అది కూడా రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు. ఇది కాకుండా, మీరు నీరు అధికంగా ఉండే పుచ్చకాయ మరియు దోసకాయలను ఎక్కువగా తీసుకోవాలి.
జాగ్రత్తగా తినండి
ప్రతిసారి భోజనంలో మనం ఏమి తింటాము, ఎంత తింటాము అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆహారాన్ని బాగా నమిలి నెమ్మదిగా తినాలి. ఇలా తినడం వల్ల ఆహారం సక్రమంగా జీర్ణమై అందులోని పోషకాలన్నీ సక్రమంగా శరీరానికి అందుతాయి. ప్రధానంగా భోజనం చేసేటప్పుడు టీవీ, మొబైల్ వంటివి చూడకూడదు
సమతుల్య భోజనం తినండి
వెయిట్ లాస్ డైట్ పాటించే వ్యక్తులు తమ ఆహారంలో గింజలు, ఆలివ్ నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోవాలి. అదనంగా, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వీటన్నింటినీ ఆహారంలో కలుపుకుంటే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు వంటి అన్ని రకాల పోషకాలు శరీరానికి అందడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు.
వ్యాయామం చేయండి
బరువు తగ్గాలంటే వ్యాయామం తప్పనిసరి. ఇప్పుడు చాలా మంది కూర్చొని పని చేస్తున్నారు. అందుకే బరువు పెరిగిపోతున్నారని చెప్పడంలో సందేహమేమీ లేదు. అందుకే యోగా, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ మొదలైన కార్యక్రమాలలో పాల్గొనాలి. దీంతో ఆరోగ్యంగా బరువును తగ్గుతారు. అలాగే శరీరంలోని అదనపు కొవ్వులు కరిగిపోతాయి.
నిద్ర తప్పనిసరి
బరువు తగ్గాలంటే ఆహారం, వ్యాయామంపైనే కాకుండా తగినంత నిద్రపైనా దృష్టి పెట్టాలి. అది కూడా రోజుకు 7-9 గంటలు నిద్రపోవాలి. మీకు తగినంత నిద్ర లేకపోతే, మీ శరీరంలోని హార్మోన్లు డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి మీరు ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలనుకుంటే, ప్రతిరోజూ తగినంత నిద్రపోవాలి.
స్థిరంగా ఉండండి
రాత్రికి రాత్రే బరువు తగ్గాలంటే అది సాధ్యం కానీ పని. అందుకే బరువు తగ్గాలనుకునే వ్యక్తులు తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలపై స్థిరంగా ఉండాలి. సహనంతో డైట్ పాటించాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలా రెగ్యులర్‌గా పాటిస్తే కచ్చితంగా బరువు తగ్గుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications