Latest Updates
-
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
Parineeti Chopra Weight Loss: 28 కిలోలు తగ్గిన పరిణీతి చోప్రా, ఇలా చేసింది.. బరువు తగ్గింది!
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా వార్తల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మే 13వ తేదీన ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ రాఘవ్ చద్దాతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా గత కొంతకాలంగా కలిగి తిరుగుతున్నారన్న వార్తలు వచ్చాయి. వీరిద్దరూ రిలేషన్‌షిప్ లో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూసింది. తాజాగా జరిగిన ఎంగేజ్మెంట్ తో వాటన్నిటికీ నిజం చేసేసింది పరిణీతి చోప్రా, రాఘవ్ చద్ధా జోడి.
పరిణీతి చోప్రా ప్రస్తుతం అద్భుతమైన అందంతో, ఆకట్టుకునే శరీరాకృతితో మెస్మరైజ్ చేస్తున్నా.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాత్రం చాలా ట్రోల్స్ ను ఎదుర్కొంది. ఒకప్పుడు లావుగా ఉండేది పరిణీతి చోప్రా. అయితే ఆ తర్వాత డైట్ మార్చేసి, వర్కవుట్స్ చేయడంతో 28 కిలోలకు పైగా బరువు తగ్గింది.

పరిణీతి చోప్రా వెయిట్ లాస్ జర్నీ ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. లావుగా ఉన్న పరిణీతి ఎలా ఫిట్ గా మారిందో తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పరిణీతి చోప్రా బరువు తగ్గడానికి ఏం చేసిందో.. ఎలాంటి డైట్ ను పాటించిందో.. పరిణీతి వెయిట్ లాస్ జర్నీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. స్ట్రిక్ట్ డైట్:
బరువు తగ్గాలనుకునే వారు ఎవరైనా మొదట చేయాల్సింది స్ట్రిక్ట్ డైట్ పాటించడం. ఏం తింటున్నాం.. ఎంత తింటున్నాం.. ఎప్పుడు తింటున్నాం అనే విషయాలపై ఎప్పుడూ దృష్టి పెట్టాలి. సమతుల్య ఆహారం తినాలి. శరీరానికి పూర్తి పోషకాహారం అందేలా చూడాలి.
2. ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్:
అల్పాహారం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెప్పే మాట. ఉదయం తీసుకునే అల్పాహారం రోజంతా ఎనర్జిటిక్ ఇచ్చి యాక్టివ్ గా ఉంచుతుంది. అనారోగ్యకరమైన అల్పాహారంతో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండటానికి ఇదే కారణం. పరిణీతి చోప్రా తన వెయిట్ లాస్ జర్నీలో అల్పాహారాన్ని ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్త పడింది.
3. హెల్దీ లంచ్:
బ్రేక్‌ఫాస్ట్ తో పాటు లంచ్ కూడా ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకునేది పరిణీతి చోప్రా. బరువు తగ్గడానికి కీలకం.. కేలరీలు తగ్గించుకోవడం. ఆహారం ద్వారా కేలరీ లాస్ ఉండేలా ఫైబర్ సహా ఇతర పోషకాలు ఎక్కువుండే డైట్ తీసుకునేది. కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువ ఉండేలా హెల్దీ డైట్ ప్రిపేర్ చేసుకునేది పరిణీతి చోప్రా.
4. వర్కవుట్స్:
హెల్దీ అండ్ స్ట్రిక్ట్ డైట్‌తో పాటు, పరిణీతి ఎక్సర్‌సైజ్, వర్కవుట్ కి కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చింది. జిమ్ లో ఎక్కువగా చెమటోడ్చింది. కేలరీలు తగ్గించుకునేందుకు చాలా రకాల వర్కవుట్స్ ప్రయత్నించింది. తన పిక్స్, వీడియోలు సోషల్ మీడియా ద్వారా కూడా పంచుకునేది పరిణీతి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications