Latest Updates
-
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి!
Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? కిరాణా షాపుకు వెళ్తే ఈ ఐటెమ్స్ తీసుకోండి
బరువు తగ్గాలంటే అవి తినాలని, ఇవి తినొద్దని చాలా మంది చెబుతుంటారు. ఫైబర్ ఎక్కువుంటే ఫుడ్స్ తినాలంటారు, డైరీ ప్రొడక్ట్స్‌కు దూరంగా ఉండాలంటారు, కార్బొహైడ్రేట్లు, ఫ్యాట్స్, ఫ్రైస్ తినొద్దని చెబుతారు. అయితే ఇలాంటి ఆహారపు అలవాట్ల వల్ల బరువు తగ్గడం ఎంత వాస్తవమో.. తగ్గిన తర్వాత తిరిగి పెరగడం కూడా అంతే సహజం. కొంత కాలం పాటు కడుపు మాడ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. రోజులు గడిచే కొద్దీ ఇది చాలా చాలా కష్టంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా డైట్ పాటించడం సవాలుగా మారుతుంది.

సులభంగా, మానసికంగా, శారీరకంగా ప్రభావం చూపకుండా బరువు తగ్గాలంటే ఆహారపు అలవాట్లలో పెద్ద మార్పులు చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. క్రమంగా చేసే మార్పులే దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే ఆహారపు మార్పులను క్రమంగా చేసుకుంటూ ఉండాలి. మీ లక్ష్యం అదే అయితే మీ కిరాణా షాపు లిస్టులో కొన్ని పదార్థాలు చేర్చుకోండి. అవి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
1. పాప్ కార్న్:
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే స్నాక్స్ చాలా కీలకం. భోజనాల మధ్యలో ఆకలిగా ఉన్నప్పుడు స్నాక్స్ తీసుకుంటాం. అయితే ఏవి పడితే వాటిని తింటే బరువు తగ్గాలన్న లక్ష్యం చేరుకోవడం కష్టం. చిప్స్, ఫ్రైస్ లాంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తింటే అదనపు కేలరీలు చేరి బరువు పెరుగుతారు. అందుకే పాప్ కార్న్ బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు వైద్యులు. పాప్ కార్న్ ఆకలి తీర్చడంతో పాటు కొంత సేపటి వరకు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అలాగే ఇందులో ఫైబర్ ఉంటుంది. కేలరీలు తక్కువ మొత్తంలో ఉంటాయి.
2. సబ్జా గింజలు:
సబ్జా గింజలు(చియా సీడ్స్) వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బరువు తగ్గించడంలో సబ్జా గింజలు చక్కగా పని చేస్తాయని న్యూట్రిషనిస్టులు చెబుతారు. సబ్జా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నీటిలో నానబెట్టిన సబ్జా గింజలు తీసుకుంటే శరీరం చల్లబడుతుందని అలాగే శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుందని చెబుతారు.
3. గుడ్లు:
ఉడకబెట్టిన కోడి గుడ్లలో అనేక పోషకాలు ఉంటాయి. తక్కువ కార్బొహైడ్రేట్లు, గ్లూటెన్-ఫ్రీ, ఇతర పోషకాలు గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. గుడ్ల ద్వారా బయోటిన్, విటమిన్ డి వంటి ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారి డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారం గుడ్లు. ఉడకబెట్టిన గుడ్ల ద్వారా గుడ్లలోని పోషకాలు పూర్తి స్థాయిలో అందుతాయి.
4. స్పార్క్‌లింగ్ వాటర్:
స్పార్క్‌లింగ్ వాటర్ అంటే కార్బొనేట్ చేయబడిన నీరు. అంటే కార్బన్ డయాక్సైడ్ వాయువును ఆ నీటికి కలుపుతారు. దీంతో సాధారణ నీరు చిన్న చిన్న బుడగలుగా కనిపిస్తుంది. అది కాస్త మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. అలా కార్బొనేట్ నీటిని స్పార్క్‌లింగ్ వాటర్ అంటారు. బరువు తగ్గడానికి స్పార్క్‌లింగ్ వాటర్ ప్రయోజనకరంగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చక్కెర పానీయాలకు బదులు స్పార్క్‌లింగ్ వాటర్ తాగిన వ్యక్తులు 12 వారాల వ్యవధిలో ఎక్కువ బరువు కోల్పోయినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
5. ఓట్స్:
బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంది ఓట్స్ సూచిస్తుంటారు. ఓట్స్ ను సరిగ్గా తింటే సులభంగా బరువు తగ్గవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఓట్స్ లో ఫైబర్, ఫాస్పరస్, సెలీనియం, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, బి కాంప్లెక్స్, మెగ్నీషియం వంటి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఓట్స్ లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపటి వరకు ఆకలి కాకుండా ఉంచుతుంది.
6. నట్స్:
నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. నట్స్ పూర్తిగా పోషకాలతో నిండి ఉంటాయి. భోజనాల మధ్యలో స్నాక్స్ గా నట్స్ తీసుకోవడం వల్ల ఆకలి తీరుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. నట్స్ ను మితంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











