Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వాల్ నట్స్,బాదంపప్పు..మెమోరీ బాగా షార్ప్ గా ఉండాలంటే ఏది తినాలో తెలుసా
డ్రై ఫ్రూట్ తింటే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. డ్రై ఫ్రూట్స్ లో కూ ఏది పడితే అది కాకుండా కొన్ని మాత్రమే ఆరోగ్యానికి మరింత మేలు చేసేవి ఉంటాయని చెబుతారు. అలాంటివాటిల్లో బాదం, వాల్‌నట్‌లు కూడా ఉంటారు. ఈ రెండూ శరీరానికి మేలు చేస్తాయి. బరువును నియంత్రించుకోవడానికి రెండు రకాల గింజలను తినాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. బాదంపప్పు ఎముకలకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. బాదంలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి ఉంటాయి. ఇవి ఎముక సాంద్రతను పెంచడంలో సహాయపడతాయి.
వాల్‌నట్స్‌లో విటమిన్ B6, యాంటీఆక్సిడెంట్లు,మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి, ఇవి మెదడులోని నరాలకు మంచివని చెబుతారు జ్ఞాపకశక్తిని పెంచుకోడానికి పిల్లలు, వృద్ధులు వాల్‌నట్స్ తినడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తుంటారు.

ఏది ఎక్కువ ప్రయోజనకరం?
బాదం, వాల్ నట్ రెండూ బ్రెయిన్ ని షార్ప్ చేసేవి అయినప్పటికీ ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరం? పోషక విలువల విషయానికి వస్తే వాల్‌నట్స్ బాదం కంటే ఒక అడుగు ముందు ఉంటుంది. ఎందుకంటే వాల్‌నట్స్‌లో బాదం కంటే రెండు రెట్లు ఎక్కువ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది.
వాల్‌నట్స్ లో ఇంకా ఏముంది?
వాల్‌నట్స్ యాంటీఆక్సిడెంట్లకు మూలం. ఈ మూలకం శరీరంలోని ఫ్రీ రాడికల్స్ సమతుల్యతను కాపాడుతుంది. ఫలితంగా ఆక్సీకరణ ఒత్తిడి కూడా నియంత్రించబడుతుంది. మెదడు వృద్ధాప్య సమస్యలను నియంత్రించడం సులభం. దీంతో పాటు వాల్‌నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇవి నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి కూడా సహాయపడతాయి.
వయసు పెరిగే కొద్దీ మతిమరుపు లేదా జ్ఞాపకశక్తి కోల్పోయే ధోరణి ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా వాల్‌నట్స్ తినే అలవాటు కలిగి ఉంటే అది చిత్తవైకల్యం, అల్జీమర్స్ లేదా పార్కిన్సన్స్ రూపం తీసుకోకముందే దీనిని నివారించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications